ధాన్యం ఎగుమతి లో జాప్యం చేయవద్దు

Uncategorized తెలంగాణ వ్యవసాయం సూర్యాపేట

ధాన్యం ఎగుమతి లో జాప్యం చేయవద్దు

:-టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలి

:-ఎరువుల కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు

 మీ న్యూస్ ప్రతినిధి 9640659560 మే 28:-ధాన్యం బస్తాలు ఎగుమతి చేయటంలో జాప్యం చేయవద్దు అని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు.బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు జాజిరెడ్డిగూడెం మండలంలోని వేల్పుచర్ల, రామన్నగూడెం, జాజిరెడ్డిగూడెంలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆకాల వర్షాలకి వడ్లు, కాంటా వేసిన బస్తాలు తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసుకొని కాంటా వేయగానే వెంటనే ధాన్యం లారీలకి లోడ్ చేయాలని తెలిపారు.లారీలను సర్దుబాటు చేస్తామని సాధ్యమైనంత తొందరగా కేంద్రాలలో ఉన్న మొత్తం ధాన్యం కొనుగోలు చేసి కొనుగోలు కేంద్రాలను ముసివేయాలని సూచించారు.రైతులతో మాట్లాడుతూ రెండు మూడు రోజులలో అన్ని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని తెలిపారు.ఆయా కేంద్రాలలో రికార్డులను పరిశీలించి ఎన్ని లోడ్లు తరలించారు ఇంకా ఎన్ని లోడ్లకి సరిపోను ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉందని నిర్వాహకులని అడిగి తెలుసుకున్నారు.జాజి రెడిగూడెం మండలం వేల్పుచర్ల యన్ డి సీ యం నుండి 11,200 క్వింటాలు,రామన్నగూడెం పి ఏ సీ ఎస్ నుండి 10,000 క్వింటాలు,

జాజిరెడ్డిగూడెం యోగనంద లక్ష్మి నరసింహ స్వామి యం ఎ సి ఎస్ నుండి 10,676.4 క్వింటాల ధాన్యం మిల్లులకి ఎగుమతి చేయటం జరిగిందని తెలిపారు.కొనుగోలు కేంద్రాలకి సరిపోను లారీలను పంపుతామని త్వరగా ధాన్యం పూర్తి చేయాలని సూచించారు.తదుపరి జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో గల ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం ఎరువుల దుకాణాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరువులు మరియు విత్తనాలు స్టాక్ రిజిస్టర్స్, స్టాక్ బోర్డులు పరిశీలించారు. ఎరువులను కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీ రేటు కన్నా ఎక్కువ అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని అడిషనల్ కలెక్టర్ అన్నారు. రైతులకు సరిపడే ఎరువులు, మరియు విత్తనాలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి ,తహసీల్దార్ యాదగిరి,మండల వ్యవసాయ అధికారి గణేష్ ,అధికారులు,సిబ్బంది,తదితరులు,పాల్గొన్నారు.