సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్న పందిళ్లపల్లి కుటుంబం

Uncategorized మోతే సూర్యాపేట

సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్న పందిళ్లపల్లి కుటుంబం

⏩:-దాసరి నాగమ్మకు 6 వేల రూపాయలు అందజేసిన *పందిళ్లపల్లి ఉపేందర్ రావు

 

మీ న్యూస్ ప్రతినిధి:-మోతే మండలంలోని రావిపహాడ్ గ్రామానికి చెందిన *మోతె మాజీ జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు, మల్లారావు, శ్రీనివాసరావుల* కుటుంబం ఆపదలో ఉన్న వారికి తమ వంతు సాయం చేస్తూ సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు. ఆపద వచ్చిందని తలుపు తడితే చాలు 5వేలు, 10వేల చొప్పున వారికి వైద్య, ఇతర ఖర్చులకు అందజేస్తూ భరోసా కల్పిస్తున్నారు. సేవ చేయడం వల్ల ఆపదలో ఉన్న కుటుంబాలకు ఎంతో కొంత భరోసా లభిస్తుందని, ప్రతి ఒక్కరు తమకు తోచిన సహాయం చేయాలనే స్ఫూర్తిని రగిలిస్తూ వారి కుటుంబం ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామానికి చెందిన దాసరి నాగమ్మకు 6 వేల రూపాయలను పందిల్లపల్లి ఉపేందర్ రావు ఆర్థికసాయం అందజేశారు. దీంతో గ్రామంలోని పెద్దలు, యువకులు అతడి సేవా కార్యక్రమాలను అభినందిస్తూ కొనియాడారు. మున్ముందు వారి సేవలు మరింతగా విస్తరించాలని, ప్రతి ఒక్కరికి అండగా నిలవాలని అభినందిస్తూ ఆకాంక్షించారు.వారి వెంట *పందిళ్లపల్లి వినేష్ రావు* కోట ఉపేందర్ రెడ్డి, గోపగాని శ్రీను , బత్తిని నరేష్ , వీరమళ్ళ సుధాకర్ , గోదాల సైదులు , గోదాల సతీష్ , పొడపంగి లక్ష్మినారాయణ , దాసరి శ్రీను , నాగ చారీ , శేఖర్, పగిల్లా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.