సీతారాం ఏచూరి మరణం CPM పార్టీకి తీరని లోటు

Uncategorized క్రైమ్ తాండూర్ రంగారెడ్డి రాజాకియం వికారాబాద్

సీతారాం ఏచూరి మరణం CPM పార్టీకి తీరని లోటు

—నీ ఆశ‌యాల కోసం కంక‌ణబద్ధుల‌వుతాం కామ్రేడ్‌

—మీ మ‌ర‌ణం వామ‌ప‌క్షాల‌కే కాదు

యావ‌త్ దేశానికే తీర‌ని లోటు

—అమ‌ర్‌ ర‌హే సీతారాం ఏచూరి ఘ‌న నివాళి 

—క‌మ్యూనిస్టు యోధుడికి సీపీఐ (ఎం) తాండూర్ క‌మిటీ,విద్యార్థి,ప్రజాసంఘాల ఘ‌న నివాళి అంబేద్కర్ విగ్రహ కూడలి లో ఏచూరి 

—సీతారాం చిత్ర‌ప‌టానికి పూల‌మాలేసి నివాళుల‌ర్పించడం జరిగింది.

 మీ:: (న్యూస్ ప్రతినిధి) నీ ఆశ‌యాల సాధ‌న కోసం కంక‌ణ‌బ‌ద్ధుల‌వుతాం కామ్రేడ్, అదే మా ఆశ‌యం, ల‌క్ష్యం అంటూ సీపీఐ (ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరికి ఘ‌న నివాళుల‌ర్పించింది. ఆయ‌న మ‌ర‌ణం సీపీఐ(ఎం), వామ‌ప‌క్షాల‌కేకాదు, యావ‌త్ దేశానికే తీర‌ని లోట‌ని సంతాపం వెలిబుచ్చింది. గొప్ప సైద్ధాంతిక నిబ‌ద్ధ‌త‌గ‌ల నేత‌, మార్క్కిస్టు మేధావి, ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్‌, సామాజిక‌, ఆర్థిక, రాజ‌కీయాంశాల‌పై అన‌ర్గ‌ళంగా మాట్లాడిగ‌లిగిన ఏచూరి క‌న్నుమూయ‌టం ప‌ట్ల దిగ్ర్భాంతిని వ్య‌క్తం చేశారు.దేశం అత్యంత సంక్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఆయ‌న మ‌ర‌ణంతో పెద్ద దిక్కును కోల్పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు .

 

CPM జిల్లా కార్యవర్గ సభ్యులు కే.శ్రీనివాస్,యు.బుగ్గప్ప లు మాట్లాడుతూ…

      ఈ సంద‌ర్భంగ ఇక లేర‌న్న వార్త‌ను జీర్ణించుకోలేక‌పోతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చెన్నైలో పుట్టి, హైద‌రాబాద్‌లో పాఠ‌శాల విద్య‌న‌భ్య‌సించి, ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థి నేత‌గా ఎదిగిన ఆయ‌న‌… ఎమ‌ర్జెన్సీ స‌మయంలో ఆనాటి ప్ర‌ధాని ఇందిరా గాంధీనే ప్ర‌త్య‌క్షంగా ఎదుర్కొన్నార‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో ఆయన జైలు జీవితం గ‌డిపార‌ని చెప్పారు. 1974లో ఎస్ ఎఫ్ ఐలో చేరిన ఏచూరి, 50 ఏండ్ల త‌న సుదీర్థ రాజ‌కీయ జీవితంలో వామ‌ప‌క్ష, ప్ర‌జాతంత్ర ఉద్య‌మాల‌కు ద‌శ‌, దిశా, నిర్దేశం చేశార‌ని వివ‌రించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో పార్టీ సంక్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్న‌ప్పుడు ఎప్ప‌టిక‌ప్పుడు మార్గ‌ద‌ర్శ‌నం చేస్తూ అండ‌గా నిలిచార‌ని గుర్తు చేశారు. అంత‌కుముందు విద్యుత్ పోరాటం, భూ పోరాటాల సంద‌ర్భంగా ఆయ‌న విలువైన సూచ‌న‌లు, స‌ల‌హాలనిచ్చార‌ని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ చ‌ట్టం పోరాటం సంద‌ర్భంగా అండ‌గా నిల‌బ‌డ్డార‌ని అన్నారు. ఏచూరి చూపిన బాట‌లో ప‌య‌నించటం ద్వారా ఆయ‌న ఆశ‌యాల సాధ‌నకు ప్ర‌తిన‌బూనాల‌ని అన్నారు.

     అదేవిదంగా పార్టీల‌కు అతీతంగా అంద‌రూ అభిమానించే గొప్ప నేత సీతారాం ఏచూరి అని కొనియాడారు. పాల‌కుల విధానాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నిశితంగా ప‌రిశీలిస్తూ వాటిని పార్ల‌మెంటు లోప‌లా, బ‌య‌టా తూర్పార‌బ‌ట్టిన నేత అని నివాళుల‌ర్పించారు. మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కాశ్మీర్ జ‌ఠిల‌మైన స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్న‌ప్పుడు వాటిని ఎదుర్కొని ఆ రాష్ట్రంలో అడుగుపెట్టిన ధీశాలి.. ఏచూరి అని అన్నారు. తెలుగువాడైన ఏచూరీని చూసి త‌మకు పెద్ద దిక్కు ఉంద‌ని అనుకునేవార‌నీ, ఇప్పుడా అవ‌కాశం లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీజేపీకి వ్య‌తిరేకంగా ఇండియా వేదిక‌ను ఏర్పాటు చేయ‌టంలోను, దాన్ని నిల‌బెట్ట‌టంలోను, ముందుకు న‌డిపించ‌టంలోనూ ఆయ‌న పాత్ర మ‌రువ‌లేనిద‌ని చెప్పారు.ఆయ‌న త్వ‌ర‌లోనే కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అవుతార‌ని భావించామ‌ని అన్నారు. కానీ అందుకు భిన్నంగా ఏచూరి మ‌ర‌ణ వార్తను వినాల్సి రావ‌టం క‌ల‌చి వేసింద‌ని వాపోయారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను ఆప్యాయంగా, పేరు పెట్టి పిలిచే ఆయ‌న లేక‌పోవ‌టం దిగ్ర్బాంతిక‌ర‌మ‌ని అన్నారు. క‌మ్యూనిస్టు మేధావి అయిన సీతారాం మ‌ర‌ణం దేశానికి తీర‌ని లోట‌ని ఆయ‌న నివాళుల‌ర్పించారు.

ఈ కార్యక్రమం SFI తాండూర్ డివిజన్ కార్యదర్శి సీరియల,సిపిఎం నాయకులు మల్లేష్, సురేష్,శేఖర్ లాలప్ప,sc,st,bc, మైనాటి హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కే.చంద్రయ్య,రవి,రఘుపతి వెంకటయ్య ,తదితరులు పాల్గొన్నారు.