ఆటో ద్విచక్ర వాహనం డీ ఇద్దరికీ గాయాలు

Uncategorized క్రైమ్ తాండూర్ వికారాబాద్

ఆటో ద్విచక్ర వాహనం డీ ఇద్దరికీ గాయాలు

⏩::మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలింపు

 

తాండూర్ రూరల్ మీ న్యూస్ ప్రతినిధి మే 11:- తాండూరు మండలం అల్లాపూర్ గ్రామ సమీపంలోని చించోళ్లి ప్రధాన రోడ్డు మార్గంలో ఎదురెదురుగా వస్తున్న ఆటో, ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు కరన్ కోట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్సు లో తాండూరులోని జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ వైపుకు వస్తున్నటువంటి ద్విచక్ర వాహనం తాండూర్ నుండి అల్లాపూర్ వైపుకు వెళ్తున్నటువంటి ఆటో నంబర్ టీ జి 34 టీ 3406 గల రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీ కొనగ ద్విచక్ర వాహనం నంబర్ ఎపి 09 సి ఎన్ 9939 పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు షేక్ నిజాముద్దీన్,ఖాజా మియా లతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న చిన్న పాపకు గాయాలు అయినట్లు చెప్పారు. తీవ్ర గాయాలకు గురైన ఇద్దరి వ్యక్తులను తాండూరు జిల్లా ఆసుపత్రి కి తరలించగా అక్కడి వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించాల్సిందిగా సూచించిన్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.