విద్యారంగ పరిరక్షణకు కృషి చేయాలి: మోతే ఎంఈఓ

Uncategorized మోతే సూర్యాపేట

విద్యారంగ పరిరక్షణకు కృషి చేయాలి: మోతే ఎంఈఓ

 

మీ న్యూస్ ప్రతినిధి::ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మోతే మండల విద్యాధికారి గోపాల్ రావు అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల స్థాయిలో విద్యార్థుల ప్రగతిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమంలో అంకిత భావంతో భాగా స్వాములై ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే విధ్యంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రంలో ఎం ఎన్ ఓ బి.ఎల్. ఎన్ చారి,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కె.రామ నర్సయ్య,శోభబాయి, రాజేశ్వరెడ్డి ,అమృత రెడ్డి,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.