అవగాహనతో ఒక ప్రాణమైన మనం కాపాడుకోగలగాలి 

Uncategorized నల్లగొండ సూర్యాపేట

అవగాహనతో ఒక ప్రాణమైన మనం కాపాడుకోగలగాలి 

డ్రైవర్ల అతి వేగంతోనే అధిక ప్రమాదాలు 

మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు

క్యాబ్ డ్రైవర్లకు రోడ్డు రవాణా జాగ్రత్తలపై అవగాహన కల్పించిన ఆర్టీవో సురేష్ రెడ్డి 

 

 

  మీ న్యూస్ సూర్యాపేట ప్రతినిధి జనవరి 07::రోడ్డు రవాణా జాగ్రత్తలపై అవగాహన పెంచుకొని ఒక ప్రాణమైన మనం కాపాడుకోగలగాలని జిల్లా రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారి సురేష్ రెడ్డి అన్నారు. రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా ఫోర్ వీలర్ లైట్ మోటార్ వెహికల్ యూనియన్ ఆధ్వర్యంలో హైటెక్ బస్టాండ్ వద్ద, ఐఎన్ టి యుసి సూర్యాపేట లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద వేరు వేరుగా క్యాబ్ డ్రైవర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని డబ్ల్యూహెచ్వో ద్వారా తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆ మరణాలను నివారించేందుకు రోడ్డు భద్రత వారోత్సవాలను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం రాష్ట్రంలో 1,70,000 మంది ప్రాణాలు కోల్పోగా 6 లక్షల మంది వికలాంగులుగా మిగిలారని వీరంతా 35 సంవత్సరాల యువకులేనని అన్నారు. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని నడపవద్దని ఎక్కువగా ప్రమాదాలు అతివేగంతోనే జరుగుతాయని మద్యం సేవించి డ్రైవర్లు స్టీరింగ్ ముట్టుకోవద్దన్నారు. రోడ్ సిగ్నల్స్ ను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. ఎం వి ఐ జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా డ్రైవర్లకు ఓపిక ఉండాలని వేగం కన్నా ప్రాణం మిన్న అన్నారు. వాహనాలు నడిపే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అరిగిన టైర్లతో వాహనాన్ని నడిపితే రోడ్డు ప్రయాణంలో పగిలే ప్రమాదం ఉందని దాంతో పెను ప్రమాదాలు చోటు చేసుకుంటాయన్నారు. ముందుగా వాహనం ఎక్కి స్టీరింగ్ పట్టుకున్న వెంటనే సెంటర్ మిర్రర్ ను సరి చేసుకుంటే సైడ్ మిర్రర్స్ పై కాన్సన్ట్రేషన్ పెట్టకుండా వెనుక నుంచి వచ్చే వాహనాలు అన్ని కనిపిస్తాయని తెలిపారు. అలాగే వాహనాలకు సంబంధించి లోబీం ఐబీమ్ ను సమయానుకూలంగా వేసుకోవాలని లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు ప్రతి రెండు గంటలకు ఒకసారి విశ్రాంతి తీసుకోవాలన్నారు. నిద్ర మత్తులో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయవద్దని నిద్రమత్తు పెను ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. అనంతరం రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులతో పాటు, సీనియర్ డ్రైవర్ ముజ్జు బాయ్ ని పూలమాలలు శాలువాతో ఘనంగా సత్కరించి రోడ్డు నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడుపుతామని ప్రతిజ్ఞ చేశారు. ఫోర్ వీలర్ లైట్ మోటర్ వెహికల్ యూనియన్ అధ్యక్షులు మరికంటి అంబేద్కర్, ఐ ఎన్ టి యు సి సూర్యపేట లైట్ మోటర్ వెహికల్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు కాసాని పాపన్న గౌడ్ ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సతీష్ కుమార్, విక్రమ్ కుమార్, తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పెరుమాళ్ళ ప్రవీణ్, జంగం మహేష్, షారూక్, ముజ్జు బాయ్, కప్పల ఉపేందర్, బాలు నాయక్, కోడి సైదులు, బడుగుల చంద్రశేఖర్, మొండి కత్తి వెంకన్న, ఫోర్ వీలర్ లైట్ మోటార్ వెహికల్ యూనియన్ నాయకులు వీరన్న, ప్రసాద్, పిల్లల శ్రీను, సంతు, వెంకన్న, యుగేందర్, ఉదయ్ రెడ్డి, అంబేద్కర్ తో పాటు క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు.