అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి గ్రామీణ పేదల సంఘం
మీ న్యూస్ ప్రతినిధి::చివ్యేంల మండల కేంద్రంలోని ఎంపీడీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య గారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో ఉపాధి హామీ కూలీల కుటుంబానికి 150రోజులు పని దినాలు కల్పించాలని కొన్ని గ్రామాలలో ఇప్పటివరకు పని కల్పించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పని కల్పించిన గ్రామాలలో ఒక వారం ఒక గ్రూపుకి ఒక వారం మరొక గ్రూపుకి అవకాశం కల్పిస్తున్నారు దాని వలన కూలీలు సగం రోజులు పనిచేసే మిగిలిన సగం రోజులో నష్టపోతున్నారు అదేవిధంగా కూలీలకు ప్రస్తుతం నిత్యవసర ధరల సూచిక ఆధారం ప్రకారం ప్రతికూలికి 350/- రూపాయల చొప్పున వేతనం కల్పించాలి అదేవిధంగా వారం వారం ప్రతికూలికి ప్లేస్ స్లిప్ అందించి వారి డబ్బులను అకౌంట్లో జమ చేయాలి ఈ సంవత్సరం మార్చి మాసం నుండి ఇప్పటి వరకు పని చేసిన కూలీలకు డబ్బులు రాలేదని దాంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు
భాషిపంగు సునీల్ మాట్లాడుతూ పని ప్రదేశంలో ప్రాథమిక వైద్య సదుపాయం మరియు టెంటు మరియు మంచినీరు సదుపాయం కల్పించాలి వేసవి తీవ్రతకు కూలీలు ఇబ్బందులు పడకుండా ఉదయం 10 గంటల వరకే పని చేయించాలి వడదెబ్బకు ప్రమాదం జరిగిన కూలీలకు ప్రభుత్వమే బాధ్యత వహించి బీమా సదుపాయం కల్పించాలి మరియు ఉపాధి కూలీలకు పనిముట్లను ప్రభుత్వం అందించాలి అని అన్నారు
ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య గ్రామీణ పేదల సంఘం జిల్లా నాయకులు అనంతుల ఎల్లయ్య ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ జిల్లా కార్యదర్శి బాషిపంగు సునీల్ వెంకన్న బాబు రమేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు