హెల్పింగ్ ఫౌండేషన్ జాతీయ ఉత్తమ్ సోషల్ వర్కర్ గా బంగారు నంది అవార్డు
మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త గుండెపంగు రమేష్ తాను చేసిన విశిష్ట సామాజిక సేవలను గుర్తించిన హైదరాబాద్ కు చెందిన మెగా హెల్పింగ్ ఫౌండేషన్ జాతీయ ఉత్తమ్ సోషల్ వర్కర్ గా బంగారు నంది అవార్డు ప్రకటించింది. కోదాడకు చెందిన గుండెపంగు రమేష్ కు ఈ పురస్కారం దక్కడం పై పట్టణానికి చెందిన ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.శనివారం హైదరాబాదులోని బిఎం బిర్లా సైన్స్ మ్యూజియంలో వివిధ రంగాల సామాజిక సేవలలో విశిష్ట సేవలు అందించిన, వారికి జాతీయ పురస్కారాలు పేరిట బంగారు నంది అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా సినీ నటుడు,కమెడియన్,పొలిటీషియన్ బాబుమోహన్ చేతుల మీదుగా ఉత్తమ సోషల్ వర్కర్ గా జాతీయ పురస్కారం,బంగారు నంది అవార్డును అందుకున్నట్లు అవార్డు గ్రహీత గుండెపంగు రమేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి రక్తదానం, నేత్రదానం లాంటి సేవా కార్యక్రమాలే కాకుండా ఎన్నో సామాజిక,సంక్షేమ,సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు..