మీ న్యూస్ ప్రతినిధి::మోతే : సూర్యాపేట జిల్లా మోతే మండలం రావి పహాడ్ గ్రామంలోని సిపిఎం పార్టీ కార్యాలయానికి ఆదివారం హుజూర్ నగర్ లో జరుగుతున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ రావి పహాడ్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు సిపిఎం పార్టీ కార్యాలయానికి ఫ్లెక్సీ కట్టారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలియజేస్తున్న డివైఎఫ్ఐ మోతే మండల కార్యదర్శి వెలుగు మధు పై కాంగ్రెస్ కార్యకర్త తండు సతీష్ మరికొందరు దాడికి తెగబడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని సిపిఎం కార్యాలయం ముందు సిపిఎం కార్యకర్తలు నిరసన తెలియజేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వగ్యవాదం వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ సభ్యులు సోమ గాని మల్లయ్య, సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి ఎర్రబోయిన మల్సూరు మాట్లాడుతూ సిపిఎం పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడమే కాకుండా ఇదేమిటి అని ప్రశ్నించిన సిపిఎం కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడ్డారని అన్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ పోలీసులు అధికార పార్టీకే వత్తాసు పలుకుతున్నారు తప్ప ఘటన జరిగి రెండు మూడు గంటలు అవుతున్న పోలీసులు సంఘటన స్థలానికి రాకుండా అధికార పార్టీకి సహకరిస్తున్నారని అన్నారు.
సిపిఎం కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ మట్టిపల్లి సైదులు
మోతే మండలం రావిపాడు గ్రామంలోని సిపిఎం కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఇదేమిటి అని ప్రశ్నించిన సిపిఎం పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడడం దుర్మార్గమైన చర్యాని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మోతే మండలంలో అరాచక శక్తులు పెట్రేగి పోతున్నాయని సిపిఎం పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. దాడులు సిపిఎం పార్టీ కార్యకర్తలకు కొత్త కాదని అన్నారు. తక్షణమే సిపిఎం పార్టీ కార్యాలయం పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ని తీసివేయాలని సిపిఎం పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని చేస్తామని హెచ్చరించారు.