వ్యవసాయ విద్యార్థుల కు గ్రామీణ కృషి అనుభవం ఎంతో ముఖ్యం
డిగ్రీ విద్యార్థులు అవగాహనా కలిపిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్త కె.వి.కె
మీ న్యూస్ (28 ఆగస్టు 2024)సూర్య పేట్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్
గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం (రావే ) లో భాగంగా లయోలా అకాడమీ సికింద్రాబాద్ కి చెందిన బి యస్సి వ్యవసాయ డిగ్రీ కోర్సు విద్యార్థినిలు గ్రామీణ వ్యవసాయ విధానాలు స్థితిగతులను తెలుసుకొని గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణ (PRA) కార్యక్రమం ద్వారా అధ్యయనం చేసినట్లు కె.వి.కె శాస్త్రవేత్త డి ఆదర్శ్ తెలిపారు. మోతే గ్రామం యందు నిర్వహించిన గ్రామీణ అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విద్యార్థినిలు గ్రామస్తులతో సంభాషించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలను గ్రామ పటం, వెన్ డయాగ్రమ్,పై చార్ట్,చిత్రాల రూపంలో ప్రదర్శించి గ్రామీణ రైతులకు అవగాహన కల్పించినట్లు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో గ్రామం యొక్క వనరులను గ్రామ పటం ద్వారా చిత్రీకరించి మరియు గ్రామంలోని రైతుల వర్గీకరణ, జనాభా భౌగోళికప్రాంతం ,నీటి వనరులు, వ్యవసాయ దిగుబడులు, చీడ పీడల నివారణ కు ఆచరిస్తున్న మొదలగు విధానాల అంశాలపై, పై-చార్ట్ లో చిత్రీకరించి రైతులకు అవగాహనా కలిపించారు.
అదేవిధంగా రైతులు ఎక్కువగా ఒకే పంట పండిస్తున్నారని దాని ద్వారా భూసారం తగ్గి, పంట చీడపీడలు ఎక్కువగా పెరిగి దిగుబడులు తగ్గుతున్నాయని తెలుపుతూ పంట మార్పిడి విధానాన్ని పాటించి దిగుబడులను పొందవచ్చు అన్నారు. రైతులు ఒకే పంట కాకుండా సమగ్ర వ్యవసాయం చేస్తూ సరియైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచిదిబడులు పొందవచ్చునని తెలియజేశారు అదేవిధంగా కెవికె గడ్డిపల్లి వారు రైతుల కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి కార్యక్రమంలో పాల్గొన్న ఎ. నరేష్ రావే ఇంచార్జ్ రైతులకు వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని అరుణ విస్తరణ అధికారి రైతులు కట్ట వెంకటరెడ్డి లింగారెడ్డి రామ్ రెడ్డి సోమయ్య, కుమార్, లింగరాజు, యాదమ్మ, బిక్షపతి రెడ్డి, శేఖర్,
వ్యవసాయ విద్యార్థినిలు శ్వేత, రచల్, అంజలి, స్నేహ, ఈషా, సుస్మిత పాల్గొన్నారు