తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపిన యువజన కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్
మీ న్యూస్ ప్రతినిధి::బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించేందుకు సాహసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సామాజిక వర్గం ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రం కూడా చేయలేని సాహసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించి విద్యా ఉద్యోగ రాజకీయాలలో సైతం 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన చరిత్ర కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు దేశ చరిత్రలోనే ఎవరు చేయలేని విధంగా బీసీ కులగనన చేసి ఆదర్శవంతంగా నిలిచినన్నారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం అన్నారు