భగత్ సింగ్ స్ఫూర్తితో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

Uncategorized మోతే రాజాకియం సూర్యాపేట

భగత్ సింగ్ స్ఫూర్తితో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

⏩::PYL జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య

 

మీ న్యూస్ మార్చి 18::దేశ స్వాతంత్రం కోసం, అణిచివేత, దోపిడి, దౌర్జన్యాలకు, సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిరంతర పోరాట స్ఫూర్తితో సాగిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల వర్ధంతి సభలు ప్రతి గ్రామ గ్రామాన వాడవాడన నిర్వహించాలని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య పిలుపునిచ్చారు. మోతే మండల పరిధిలోని రాయిపహాడ్ గ్రామంలో నిర్వహించిన సమావేశం జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య పాల్గొని మాట్లాడుతూ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల 94 వ వర్ధంతి సందర్భంగా జిల్లా పరిధిలోని ప్రతి గ్రామంలో వాడవాడనా భగత్ సింగ్ వర్ధంతి సభలు విస్తృతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశంలో మోడీ ప్రభుత్వం కుహానా దేశభక్తిని బట్టబయలు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న భారత ప్రజలపై అనుసరించే దుశ్చర్యలకు వ్యతిరేకంగా, భగత్ సింగ్ స్ఫూర్తితో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల 94వ వర్ధంతి సభలు ఈ నెల 23 నుండి 30 వరకు నిర్వహించాలని విద్యార్థి, యువకులకు వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గుణగంటి నాగరాజు, కోడి లింగరాజు, ఎల్లబోయిన ఉమేష్, ఎస్.కె పారు, ఎస్ కె హుస్సేన్, ఎస్.కె అంబానీ, ఎస్.కె హైమద్, సాయిలు పాల్గొన్నారు.