విద్యారంగాన్ని విస్మరించిన ప్రభుత్వం

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

విద్యారంగాన్ని విస్మరించిన ప్రభుత్వం

⏩::ఎస్ఎఫ్ఐ మోతే మండల కేంద్రం ఆధ్వర్యంలో నిరసన

 

మీ న్యూస్ మార్చి13::రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయడంలో గత ప్రభుత్వ వైఖరినే ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అక్కినపల్లి వినయ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించి అభివృద్ధి పరచాలని, పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందన్నారు.గడిచిన పదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని బ్రష్టు పట్టించిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యారంగాన్ని అభివృద్ధి పరుస్తాం సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన మాటను అధికారంలోకి వచ్చి15 నెలలు అవుతున్న అమలు చేయడం లేదన్నారు. పెండింగ్స్ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయని వాటిని విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. ఒకవైపు కళాశాల యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారని వారు పేర్కొన్నారు. గురుకులాలు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు అద్దె భవనాలల్లో కాలం వెళ్ళదీస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిధులను పెంచి విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని వారు డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ నియమించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేడని స్వయానా ముఖ్యమంత్రి ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నప్పటికీ విద్యారంగ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. విద్యారంగాన్ని విద్యార్థులను విస్మరించిన గత ప్రభుత్వాలు అధికారాన్ని కోల్పోయాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని లేనిపక్షంలో గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం గణేష్, శ్రావణ్, దీపక్,నాని, తదితరులు పాల్గొన్నారు.