మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 2::పరువూ హత్యకు గురైన బంటి అలియాస్ కృష్ణ కుటుంబానికి ప్రభుత్వం అన్నీ రకాలుగా అండగా ఉండాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశర్లు డిమాండ్ చేశారు. బంటి హత్య కు నిరసనగా రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం ముందు కొవ్వొత్తులతో సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు.. ఈ సంధర్భంగా నెమ్మాది మాట్లాడుతూ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న వారినీ పరువు హత్యల పేరుతో హత్యలు చేయడం అన్యాయము ఆన్నారు.కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ చట్టం తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయలులు సుధాకర్, శ్రీను, దానేల్, శివ, లల్లి, దోశపాటి శ్రీను తదితరులు