⏩::కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు వినతిపత్రం అందజేసిన నమాజిలు
⏩::మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560
మీ న్యూస్ ప్రతినిధి మార్చి 13::పట్టణంలోని గ్రంధాలయం సమీపంలో 500 సంవత్సరాల క్రితం నిర్మితమైన పెద్ద మజీద్ నిర్మాణం పూర్తికి నిధులు మంజూరు చేయాలని నమాజిలు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో మజీద్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. గతంలో 2018 సంవత్సరంలో 50 లక్షలు మంజూరు అయ్యాయని దీంతో మసీద్ నిర్మాణం సగం వరకే పూర్తి అయిందని తెలిపారు. ఆతర్వాత 28-12-2022 నాడు మరో 50 లక్షలు మంజారు చేస్తూ నాటి ప్రభుత్వం జి.ఓ విడుదల చేసిందన్నారు. తీంతో పాటు బాహ్మణ సదన్ నిర్మణానికి కూడా 50 లక్షలు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. ఇందులో బ్రాహ్మణ సధన్ భవన నిర్మాణం పూర్తి అయి నిధులు కూడా విడుదల కావడం జరిగిందని తెలిపారు. కాగా దీంతో పాటు పెద్ద మజీద్ కు మంజూరు అయిన నిధులు నేటికి కూడా ఒక్క రూపాయి విడుదలకు నోచుకోక పోవడంతో కాంట్రాక్టర్ మజీద్ నిర్మాణాన్ని చేపట్టకుండా మధ్యలోనే వదిలేశాడని వారు ఆవేదన వ్యక్తంచేశారు. సగం నిర్మాణం తో మజీద్ లో నమాజులు చేసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడుతునాయని వారు పేర్కొన్నారు.ప్రధానంగా రంజాన్ సందర్భంగా సగం పూర్తి అయిన మజీద్ లో ప్రతి రోజు జరిగే నమాజు లతో పాటు ఇఫ్తార్ ,రాత్రి ప్రత్యేకంగా చదివే తర్రా విహ్ నమాజ్ ల సమయంలో పలు రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తంచేశారు.మజీద్ లో కరెంట్ లేకపోవడంతో ఇతర వసతులు లేక ప్రతి రోజు నమాజు కు వచ్చే వారు అవస్థలు పడుతున్నారని తెలిపారు. కావున నమాజిల ఇబ్బందులను గుర్తించి త్వరగా నిధులు విడుదల చెయాల్సిందిగా కలెక్టర్ కు వారు విజ్ఞప్తి చేశారు.కలెక్టర్ స్పందిస్తూ ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడుతామని చెప్పారు. వినతిపత్రం అందజేసిన వారిలో సయ్యద్,యస్ కె జహంగీర్, సుభాని, యూసుఫ్,సుభాని,కలిమ్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.