ఈనెల 30న నల్గొండలో జరిగే 100 వసంతాల ఉత్సవాలను జయప్రదం చేయండి
సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 18
భారతదేశంలో సిపిఐ పార్టీ ఘనమైన చరిత్ర అని సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో పట్టణ కౌన్సిల్ సమావేశం దంతాల రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పాల్గొని మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో అగ్రభాగాన నిలబడి జైలు జీవితాలు అనుభవించి ప్రాణ త్యాగాలు చేసిన పార్టీ సిపిఐ ది అని కొనియాడారు. ఆనాటి నుండి నేటి వరకు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఘనత సిపిఐ పార్టీకి ఉందని ఆయన అన్నారు. ఈనెల 26 కు పార్టీ పుట్టి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా డిసెంబర్ 30న నల్లగొండలో ఉమ్మడి జిల్లా భారీ బహిరంగ సభ వేడుకలకు భారీగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. నేడు మతోన్మాదులు , విచ్ఛిన్న కార శక్తులు భారి నుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతరం పై ఉన్నదని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో పట్టణ కార్యవర్గ సభ్యులు దోరపల్లి శంకర్, చామల అశోక్ కుమార్, చివ్వెం మండల కార్యదర్శి ఖమ్మం పట్టి రాము, జి రాజారామ్, పట్టణ కౌన్సిల్ సభ్యులు ఎండి పాషా, పెండ్ర కృష్ణ, ఎడెల్లి శ్రీకాంత్, వాడపల్లి వెంకన్న, వాడపల్లి గోపి, తదితరులు పాల్గొన్నారు.