⏩::ప్రతి మండలంలో నమూనా ఇళ్ళు,ఇద్దరు మేస్త్రీలకి న్యాక్ ద్వారా శిక్షణ…..
⏩::అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పూర్తి చేయాలి……
⏩::రాష్ట్ర హౌజింగ్ ఎండి విపి గౌతమ్
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24::అనర్హులకి ఇళ్ళు మంజూరు చేయరాదని రాష్ట్ర హౌజింగ్ ఎండి విపి గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి రాష్ట్ర హౌజింగ్ ఎండి విపి గౌతమ్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా హౌజింగ్ ఎండి మాట్లాడుతూ ప్రభుత్వం పేదవారికి ఇళ్ళు నిర్మించటం కోసం గ్రామ సభల ద్వారా అర్హులను ఎంపిక చేయటం జరిగిందని ఒక్క అనర్హనికి ఇల్లు మంజూరు చేయకూడదు అని అన్నారు.గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులు మరలా క్షేత్ర స్థాయి లో పరిశీలించి ఎవరైనా అనర్హులుంటే గుర్తించి తిరస్కరించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల వివరాలు మొబైల్ లో నమోదు చేయటం లో సూర్యాపేట జిల్లా రాష్ట్రము లోనే రెండవ స్థానం లో ఉన్నదని తెలిపారు.గ్రామసభలో వచ్చిన దరఖాస్తులు పరిశీలించేటప్పుడు పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల ఇంటిని ఫొటో క్యాప్చర్ చేయటం జరిగిందని, ఆ స్థలంలో మాత్రమే ఇల్లు కడితే మాత్రమె మొబైల్ ఆప్ తీసుకుంటుందని ఒకవేళ అప్పుడు వేరే చోట ఫొటో క్యాప్చర్ చేస్తే పై అధికారుల కి తెలియపరిస్తే స్థలం మార్చుటకు అవకాశం ఉంటుందని తెలిపారు.ఒకే ఇంటి నెంబర్ తో ఒక్కటి కంటే ఎక్కువ ఇండ్లకి అనుమతి ఇవ్వకూడదని, అలాగే గ్రౌండ్ ప్లోర్ పై మొదటి అంతస్తులో ఇందిరమ్మ ఇల్లు కి అర్హత లేదని తెలిపారు.ఎంపిడిఓ లు ప్రతి గ్రామంలో సూపర్ చెక్ చేసి నిష్పక్షపాతంగా అనర్హులను గుర్తించాలని సూచించారు.ఇందిరమ్మ ఇల్లు 400 చదరపు అడుగులలో హాల్, కిచెన్, బాత్రూం, ఒక బెడ్ రూమ్ లను నిర్మించాలని తెలిపారు.తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టేలా ప్రతి మండలం లో ఇద్దరు మేస్త్రీలకి న్యాక్ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని అలాగే నియోజకవర్గం లోని ఒక్కొక మండలంలోఒక్కొక్క టెక్నాలజీ ఉపయోగించి ఒక నమూనా ఇల్లులు నిర్మించి తక్కువ ఖర్చతో ఇల్లు పూర్తి అయ్యేలా లబ్దిదారులకి, మేస్త్రీలకి అవగాహనా కల్పించాలని సూచించారు..బేస్ లెవల్, గోడలు నిర్మించాక , స్లాబ్ పూర్తి, మొత్తం ఇల్లు పూర్తి ఇలా 4 విడుతలలో లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. మహిళా సాధికారత పెంచుటకు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ప్రతి మండలం లో రెండు ఇటుకలు తయారీ కేంద్రాలను, రెండు సెంట్రింగ్ సామాగ్రి యూనిట్లను ఏర్పాటు చేయాలని వాటిని ఉపయోగించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించేలా కృషి చేయాలని తెలిపారు.జిల్లా లో అసంపూర్తిగా మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేయుటకు అలాగే మౌళిక కావాల్సిన నిధుల కొరకు ప్రతిపాదనలు పంపాలని, వెంటనే నిధులు మంజూరు చేయటం జరుగుతుందని తదుపరి అధికారు తో మాట్లాడి వెంటనే పనులు పూర్తి చేసి లబ్ధిదారులకి అందించెవిదంగా సిద్దంచెయాలని సూచించారు.తదుపరి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 23 మండలాల పరిధిలో గ్రామాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసామని , అలాగే ఎంపిడిఓ లతో సూపర్ చెక్ చేసి ఎక్కడైనా అనర్హులను గుర్తిస్తే వెంటనే తిరస్కరిస్తామని, మహిళా సాధికారత కొరకు మహిళలచే ఇటుకల తయారీ కేంద్రాలు,సెంట్రింగ్ సామాగ్రి యూనిట్లను ఏర్పాటు చేస్తామని అలాగే ప్రతి ఇంటికి ఇసుక అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో జడ్పీ సిఈఓ వివి అప్పారావు,హౌజింగ్ ఎస్ ఈ వెంకటదాస్ రెడ్డి,పిడి ధర్మారెడ్డి,పి ఆర్ ఈఈ వెంకటయ్య, ఆర్ & బి డిఈ పవన్, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌజింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.