⏩::అంగరంగ వైభవంగా తాండూర్ లో మహిళ దినోత్సవం వేడుకలు
⏩::నియోజకవర్గంలో ఉన్న మహిళలందరిని సన్మానించిన శాసనసభ్యులు బియ్యని
⏩::పలు శాఖలో చెందిన మహిళ అధికారులు పాల్గొన్నారు
⏩:: హాజరైన తాండూర్ శాసనసభ్యులు
మీ న్యూస్ ప్రతినిధి::అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణంలోని SVR గార్డెన్స్ లో తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో గల మహిళ ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్ మహిళ సిబ్బందినీ ఐకేపీమహిళ సిబ్బందినీ , పోలిస్ శాఖలో ఉన్న మహిళ అధికారులను , ఫారెస్ట్ శాఖ లో ఉన్న మహిళ అధికారులను , ఆర్టీసీశాఖ ఉన్న మహిళ సిబ్బందిని ,విద్య శాఖలో ఉన్న మహిళా ఉపాధ్యాయురాలను, వైద్యం శాఖలో ఉన్న మహిళ వైద్యులను , రెవెన్యూ శాఖలో ఉన్న మహిళ అధికారులను, పంచాయతీ రాజ్ శాఖలో ఉన్న మహిళ సిబ్బందిని, మున్సిపల్ శాఖలో ఉన్న మహిళ సిబ్బందిని, విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళ మహిళలందరినీ ఘనంగా మహిళలను శాలువా సన్మానించి మెమెంటో అందజేసి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..ఈ సందర్భంగా శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మహిళలు అంటే వంటింటికే పరిమితం అనే నానుడి నుండి, నేడు అవకాశాలు రావాలి కానీ, భూమ్మీదే కాదు.ఆకాశం, సముద్రంలో కూడా సత్తా చాటేందుకు నేటి మహిళలు సిద్ధమవుతున్నారు. నింగి, నేల అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో పురుషుల కంటే ఎక్కువే రాణిస్తూ, ఈ దేశం సాధించే ప్రగతిలో, విజయంలో తమ వంతు పాత్ర పోషించడంలో మహిళలు ఉన్నారు. మహిళలకు అవకాశం కల్పిస్తే అద్బుతాలు సృష్టితారనే నమ్మకంతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల నిర్వహణ బాధ్యత మహిళలకు అప్పగించడం జరిగింది తెలిపారు.ఇందిరా మహిళా శక్తి ద్వారా స్వయం సహాయక సంఘాలకు తొలి విడతగా 150 బస్సులను అద్దెకు ఇచ్చే వినూత్న కార్యక్రమాన్ని ప్రపంచ మహిళా దినోత్సవం రోజున అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని, రాష్ట్ర ప్రతిష్ఠను దశదిశలా వ్యాప్తిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి, రాష్ట్ర ప్రతిష్ఠను దశదిశలా వ్యాప్తిచేయాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు మహిళా అధికారులు పలు శాఖలకు చెందిన అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు