సూర్యాపేట జిల్లా మీ న్యూస్ ప్రతినిధి జనవరి 28::నరసింహాపురం గ్రామానికి చెందిన పాల్వాయి విశ్వనాథం మృతి అత్యంత బాధాకరమని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షలు శీలం సైదులు యాదవ్ అన్నారు మంగళవారం విశ్వనాథం మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుమారులను పాల్వాయి నాగేశ్వరరావు సోమేశ్వరరావు లను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అనంతరం వారు మాట్లాడుతూ పాల్వాయి విశ్వనాథం ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు మంచికి మారుపేరైన విశ్వనాథo మన మద్యలో లేకపోవడం చాలా బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జెడ్పీటీసీ శీలం ఉమా దేవాలయ కమిటీ ధర్మకర్త కొండ లక్ష్మయ్య మాజీ సర్పంచ్ వాంకుడోత్ చంద్రశేఖర్ మాజీ ఎంపీటీసీ మిడతనపల్లి జానమ్మ పరశురాములు బీరెల్లి శ్రీనివాస్ రెడ్డి రామారావు సత్యం శ్రీరాములు నరేష్ వెంకటేష్ కర్ణ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు