మీ న్యూస్ మార్చి 9::మోతే మండలం రావిపాడు గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు ఎర్రబోయిన మంగమ్మ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పూలన్ పి ఓ డబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సమ్మ పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళా హక్కుల సాధనకై శ్రీ పురుష సమానత్వం కోసం , దోపిడి, పీడన, అసమాతులేని సమాజం కోసం జరిగే పోరాటాలలో ప్రతి మహిళ చైతన్వంతమై అన్యాయాలపై తిరుగుబాటు చేయాలని అప్పుడే మహిళా ఆత్మగౌరవానికి విలువ ఉంటుందని హైదరాబాదులో జరుగు 72వ ప్రపంచ అందాల పోటీలను వ్యతిరేకించాలని గ్రామ గ్రామాన మహిళలను చైతన్యవంతం చేసి పోరాటాల ద్వారా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొత్తపెళ్లి ఎల్లమ్మ, పొడపంగి అత్తమ్మ, శివరాత్రి ఎల్లమ్మ, కోడిదల లింగమ్మ శీలం సుభద్ర గడ్డం ఉపేంద్ర యశోద కేశ బోయిన మంగమ్మ నీలమ్మ చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు