మీ న్యూస్ ప్రతినిధి నవంబర్ 9 ::::రక్తం దానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణం పోసి పునర్జన్మ ఇచ్చిన వారవుతారనీ సూర్యాపేట డిఎస్పి రవి అన్నారు. శనివారం మండల పరిధిలోని గట్టికల్లు గ్రామంలో మద్యపాన నిషేధ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రక్తం అందక ప్రతి రోజూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని యువకులు రక్త దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గట్టిగల్లులో మద్యపానంనిషేధం ప్రారంభించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. రాజకీయాలకతీతంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మద్యపాన నిషేధం బాటలో పరిసర గ్రామాలు నడుస్తున్నాయి అన్నారు. ఆత్మకూరు మండలం అంటేనే న్యాయ పోరాటంలో చైతన్యవంతమైనదని అన్యాయం ఎక్కడ జరిగిన న్యాయ పోరాటం చేయడంలో ఆత్మకూరు గ్రామాల ప్రజలు ముందుంటారని అన్నారు. మద్యనిషేధ కారణంగా గ్రామంలో ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది అన్నారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా కనిపిస్తున్నారని వారి ఆనందాన్ని చూస్తే మధ్య నిషేధం పక్కగా అమలవుతుందని తెలుస్తుందన్నారు. యువకులు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ఐకమత్యాన్ని చాటాలన్నారు. సంస్థాపక గ్రామంగా ఉన్న గట్టికల్ ను రాబోయే ఎన్నికలలో శాంతి యుత గ్రామంగాచేస్తామన్నారు. మద్యపానం దిశగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్న యువకులను సందర్భంగా అభినందించారు. అనంతరం గ్రామ యువజన సంఘాల యువకులు రక్తదానాన్ని చేశారు. గ్రామ మద్యపాణ శాఖ కమిటీ యువజనన సంఘాలు డి.ఎస్.పి రవి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నాయకులు బైరు వెంకన్నగౌడ్ ,స్థానిక ఎస్సై శ్రీకాంత్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత భూపతి రాములును, సొంత ఖర్చులతోగ్రామoలో ని రోడ్లను మరమ్మతు చేసిన సంధ్యాల నాగార్జునను డిఎస్పి రవి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ బాధ్యులు దండా వెంకటరెడ్డి దొంతగాని కరుణాకర్ గౌడ్ గంపల కృపాకర్ గూగుల్ గణేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.