మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
సూర్యాపేట జిల్లాలో మహిళ నాయకత్వాన్ని ప్రోత్సహించిన మాజీమంత్రి ఆర్ డి ఆర్
ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 96406595 60
మీ న్యూస్ ప్రతినిధి మార్చి 8::మహిళల సాధికారతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిలు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ పిలుపుతో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేసిన మహిళా నాయకురాలను శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ తో కలిసి వారు మాట్లాడుతూ సృష్టికి మూలం, జగతికి ఆధారమైన మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. సూర్యాపేట జిల్లాలో మహిళ నాయకత్వాన్ని మాజీ మంత్రి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారని గుర్తు చేశారు. మహిళలకు పార్టీ పదవులు, ప్రజా ప్రతినిధులుగా అనేక అవకాశాలు కల్పించి వారిని ముందుకు నడిపించారని చెప్పారు. మహిళలు విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో ముందుకు సాగాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళా కార్యకర్త ఇందిరాగాంధీ, సోనియా గాంధీ లను స్ఫూర్తిగా తీసుకోని రాజకీయాల్లో రాణించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరుతో అందజేస్తూ మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. రానున్న రోజుల్లో యూత్ కాంగ్రెస్ విభాగం మహిళ నాయకురాళ్లను ప్రోత్సహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధా కిషన్ రావు, పట్టణ పార్టీ అధ్యక్షులు అంజత్ అలీ, మున్సిపల్ మాజీ ప్లోర్ లీడర్ కక్కిరేమి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ బైరు శైలేందర్, వేములకొండ పద్మ, నిఖిలాదిలిప్ రెడ్డి, దివ్య, శ్రావ్యారెడ్డి, రేణుకరాజేందర్, రాధికరమేష్, లక్ష్మీ మకట్ లాల్, కమలాచంద్రు నాయక్, లక్ష్మీకాంతమ్మ, గాజుల రాంబాయమ్మ, యూత్ కాంగ్రెస్ నాయకులు జోహార్, మల్లడ మాధవరెడ్డి, కరీముల్లా బేగ్, సుధీర్, నిఖీల్ తదితరులు పాల్గొన్నారు.