బీఆర్ఎస్ కు భీగ్ షాక్..కాంగ్రెస్ లో చేరిన సునీతా రెడ్డి

Uncategorized

బీఆర్ఎస్ కు భీగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన సునీత రెడ్డి
– మాజీ ఎమ్మెల్యేలతో వర్గ విభేదాలు కారణం..
-అసెంబ్లీ సీఎం ఛాంబర్ లో అభినందించిన సీఎం
-గాంధీ భవన్ లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్ మున్షీ
– పట్నం నివసం దగ్గర సందడే సందడి..

దీక్షతెలుగున్యూస్,తాండూరు :

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

­

వికారాబాద్ జిల్లా రాజకీయాలలో ఉత్కంఠ రేపిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా ఎమ్మెల్యేలతో వర్గ విభేదాలు తారస్థాయికి చేరడంతో ఆమె పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.అంతకు ముందు పట్నం సునీతారెడ్డి, కొడుకు రినీష్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేంధర్ రెడ్డి తమ అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం గాంధీ భవన్ కు భారీ ర్యాలీగా వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ పట్నం సునీతారెడ్డి, పట్నం రినీష్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి పట్నం ఫ్యామిలీని వెంటబెట్టుకొని అసెంబ్లీకి తీసుకెళ్లారు. సీఎం చాంబర్ లో సునీతారెడ్డి, మహేంధర్ రెడ్డి, రినీష్ రెడ్డితో ప్రత్యేకంగా భేటి అయ్యారు. “మహేంధర్ అన్నా.మీరు కూడా ఈ రోజే పార్టీలు చేరి ఉంటే బాగుండేది” అని సీఎం అన్నారు. అక్కడే ఉన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పట్నం మహేంధర్ రెడ్డి దంపతులను ఆప్యాయంగా పలకరించారు. సునీతారెడ్డి మూడు సార్లు వరుసగా జడ్పి చైర్ పర్సన్ కావడం ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక రికార్డు అని కొనియాడారు.

  • పట్నం నివాసం దగ్గర సందడే సందడి…

ఉదయం నుంచి హైదరాబాద్ లోని మహేంధర్ రెడ్డి ఇంటి దగ్గర కార్యకర్తలు, అభిమానుకు, నాయకులతో సందడి నెలకొంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి నాయకులు తరలి వచ్చారు. గాంధీ భవన్ లోను ఇదే కోలాహలం కనిపించింది. అయితే తన అనుచరులు ఎవరు కూడా పార్టీలో కలవలేదు. త్వరలో నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమక్షంలో పార్టీలో చేర్చుకోవాలని పార్టీ పెద్దలు నిర్ణయించడంతో మిగితా నాయకులెవరు చేరలేదు. కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయ్ వీర్ రెడ్డి, కాల్వ సుజాత, లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.