18 న జరిగే హైదరాబాద్ లో 67వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి
కల్లుగీత కార్మిక సంఘం 67 ఏళ్లు ప్రయాణంలో సాధించిన విజయం
మీ:: అక్టోబర్ 18.. ఈనెల 18 న జరిగే హైదరాబాద్ లో 67వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మడ్డిఅంజిబాబు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 67 ఏళ్లు ప్రయాణంలో సాధించిన విజయాలను తెలంగాణ రాష్ట్రంలోని ఈ పది సంవత్సరాలు కాలంలో సంఘం చేసిన కార్యక్రమాలను యాది చేరుకొని భవిష్యత్తు తరాలకు బాటలు వేసేందుకు ఈనెల 18న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారునీ శుక్రవారం హైదరాబాద్ తరలి వెళ్తున్న తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు వారు మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1957 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం గార్లలో ఆవిర్బవించింది. దొరలు, భూస్వాములను ఎదిరించి హర్రాజ్ మామూలు రద్దు చేయించుకుని సొసైటీలను ఏర్పాటు చేసుకున్నాం. చెట్టుపై హక్కు నౌకరు నామ రద్దు ఎక్స్ గ్రేషియా పెన్షన్ తదితర హక్కులు పోరాడి సాధించుకున్నాం ఎందరో అమరవీరుల స్ఫూర్తితో కల్లుగీత కార్మిక సంఘం మొక్కవోని దీక్షతో పనిచేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికుల సంక్షేమానికి అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాల్లో ప్రభుత్వానికి తెలియజేశాం. ఈ పది సంవత్సరాల కాలంలో కల్లు గీత కార్మికుల పక్షాన నికరంగా నిలబడి అనేక కార్యక్రమాలు నిర్వహించాము.2023లో రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వేలాది మందితో ధర్నాలు చేసి హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద రాష్ట్ర మహా ధర్నా చేసినాము, ఫలితంగా కొన్ని హక్కులు సాధించాము, సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతిలను ప్రభుత్వం అధికారం గా నిర్వహించడం ట్యాంక్ బండిపై విగ్రహం పెడతామని జనగాం జిల్లాకు పాపన్న పేరు పెడతామని చెప్పడం మన పోరాట విజయమే పెన్షన్, ఎక్స్ గ్రేషియా పెంపు 560 జీవో, నీరా కేప్ ప్రమాదలకు గురి అయిన వారికి కార్పొరేషన్ నుండి ఆర్థిక సహకారం కాటమయ్య రక్షణ కవచం లాంటివి సాధించుకుందాం ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి, వాటి పై మనము పోరాటం చేయాల్సి అవసరం ఉన్నది.మనము పోరాటము చేయనిది ఏది సాధించుకోలేము వాటిని అమలుకు చిత్త శుద్ధితో పని చేసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు.