హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

Uncategorized ఆరోగ్యం సూర్యాపేట

హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

మీ న్యూస్ సూర్యాపేట స్టాప్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560 మార్చి 7 జిల్లా కేంద్రంలోని సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో న్యూ వ్యవసాయ మార్కెట్ నందు అడ్వకేసీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఐసీటీసీ కౌన్సిలర్ బోడ నరసయ్య అవగాహన కల్పించి మాట్లాడారు. సంపూర్ణ సురక్ష కేంద్రం చేస్తున్నటువంటి కార్యక్రమాలను, సంపూర్ణ సురక్ష కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే హెచ్ఐ బారిన పడే అవకాశాలు ఉన్నటువంటి వారు ఉన్నారో వారిని హెచ్ఐ బారిన పడకుండా నెగిటివ్ గా ఉంచడమే సంపూర్ణ సురక్ష కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్ హెచ్, నరేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు గుర్తించినటువంటి రిస్క్ క్లయింట్ ని,అలాగే సిఫిలిస్,టిబి,ప్రేప్ , పెప్ గురించి వివరించారు. 

 హెల్ప్ లైన్ -నెంబర్ -1097,

 అలాగే హెచ్ఐవి /ఎయిడ్స్,

 ఆక్ట్- 2017 గురించి అవగాహన కల్పించారు. ఎట్ రిస్క్ క్లైంట్లను సిఫిలిస్ పాజిటివ్ గుర్తించినట్లయితే వారి యొక్క స్థితి తెలిసి వెంటనే రూమ్ నెంబర్ -16 ఐసీటీసీ కి పంపినట్టైతే సంపూర్ణ సురక్ష కేంద్రంలో మీరు నమోదు చేపించడం ద్వారా వారి ఆరోగ్య పరిస్థితులు వారి స్థితి గురించి సరైన మానసిక ఆరోగ్య పరమైన కౌన్సిలింగ్ నిర్వహించి వారిని హెచ్ఐవి బారిన పడకుండా ఉంచటానికి వారు సహకరిస్తారని తెలిపారు. గ్రామస్థాయిలో పరీక్షలు నిర్వహించి వారు పాజిటివ్ గా ఉన్నట్లయితే ఐసీటీసీ సెంటర్ కు పంపించి ఏఆర్టి సెంటర్లో లింకు చేయాలని,నెగిటివ్ గా ఉన్నట్లయితే వారిని సంపూర్ణ సురక్ష కేంద్రంలో చేర్పించాలన్నారు. జిల్లాలో అన్ని రకాల సుఖ లైంగిక వ్యాధులకు సంబంధించినటువంటి ఏ కేసునైనా సంపూర్ణ సురక్ష కేంద్రానికి తక్షణమే లింకు చేయాలని తెలిపారు. డాక్టర్ రమ్య మాట్లాడుతూ ప్రతి గ్రామంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ పరీక్షలు చేసుకునే విదంగా అవగాహన కల్పించాలని తెలిపారు, డాక్టర్. స్రవంతి సైకియాట్రిస్ట్ మాట్లాడుతూ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ సూచన మేరకు 2030 నాటికీ హెచ్ఐవి వ్యాప్తి పూర్తిగా నియంత్రించాలని తెలిపారు,

ఈ కార్యక్రమంలో డిఎం వో నాగేంద్ర శర్మ జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్రత్నం సంతోష్ కుమార్, ఉన్నత శ్రేణి కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ సూర్యాపేట డాక్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.