జిల్లాలో ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS (144 సెక్షన్) అమలు

Uncategorized తెలంగాణ నల్లగొండ సూర్యాపేట

జిల్లాలో ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS (144 సెక్షన్) అమలు

 

⏩ ::విద్యార్థులు బాగా చదివి పరీక్షలు రాయాలి

 

 ⏩::ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి

 

⏩::పరీక్షా కేంద్రానికి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దు

 

⏩::పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శుభాకాంక్షలు

⏩::సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోలరవీందర్ గౌడ్ 9640659560 మార్చి 4::ఈ నెల 05 వ తేది నుండి 25 వరకు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు సంభందించి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ అన్ని రకాల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్  ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పరీక్షా కేంద్రాల వద్ద 163 బి.ఎన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, మరియు చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు, మూసి వేయాలని అన్నారు. పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దుని అన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ నందు పొందుపరిచిన విధంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి, పరీక్షా సమయంకు ముందస్తుగా ఇంటి నుండి బయలుదేరాలి, కంగారుగా వెళ్ళవద్దు, రోడ్డు పై ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలించే వాహనాలు మంచి కండీషన్ లో ఉంచుకోవాలి అన్నారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేముందు తనిఖీలు నిర్వహించే సిబ్బందికి సహకరించగలరని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తమ వెంట తెచ్చుకోవద్దు అని తెలిపినారు విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు బాగా రాయాలి అవకతవకలకు పాల్పడవదద్దు అని కోరారు. ప్రతిఒక్కరూ బాగా రాయాలని శుభాకాంక్షలు తెలిపినారు.