ఆపదలో ఉన్న వారికి అండగా సీఎం సహాయనిధి

Uncategorized తెలంగాణ నల్లగొండ రాజాకియం సూర్యాపేట

ఆపదలో ఉన్న వారికి అండగా సీఎం సహాయనిధి

 

మీన్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జనవరి 18::ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. పేదవారు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలు హాస్పిటల్ లో అవకాశం లేనివారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చెక్కులను అందిస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఆరోగ్యం పట్ల పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ అందుతుందని తెలియజేశారు. నాలుగు లక్షల 30 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. చెక్కులు తీసుకున్న వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము ఏప్పుడు రుణపడి ఉంటామని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మాకు అందేలా కృషి చేసిన పటేల్ రమేష్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంమ్మూర్తి, వెలుగు వెంకన్న, షఫీ ఉల్లా, గట్టు శ్రీను,వల్దాస్ దేవేందర్, అరవింద్ రెడ్డి, ధరావత్ వెంకన్న, కరుణాకర్, తండు శ్రీను, బైరబోయిన శ్రీనివాస్,యాట వెంకన్న, యాట ఉపేందర్,పిల్లల రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.