మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 27::కోదాడ,ఫిబ్రవరి 27:నల్లగొండ ఖమ్మం వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్థానిక పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కోదాడ పట్టణానికి చెందిన పిఆర్టియురాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మాతంగి ప్రభాకర్ రావు రత్నకుమారి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దంపతుల ఇద్దరం కోదాడ పట్టణంలో ఎమ్మెల్సీ ఓటును నియోగించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది తెలిపారు.ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకున్నామని వారు తెలిపారు.