లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

Uncategorized ఆరోగ్యం క్రైమ్ నల్లగొండ సూర్యాపేట

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

⏩:: జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 22::పుట్టబోయేది ఆడబిడ్డ, మొగ బిడ్డ అని పరీక్షలు చేసి తెలుసుకొన్నా, ఆడపిల్ల అని తెలుసుకుని అబార్షన్ చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ హెచ్చరించారు. శనివారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో గర్భధారణ పూర్వ మరియు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టంపై సమీక్షించారు. ఈ చట్టంపై అందరూ అధికారులు విస్తృతంగా జిల్లాల్లో అవగాహన కల్పించాలని అన్నారు. వైద్యశాఖ అధికారులు జిల్లాలో నిర్వహిస్తున్న అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లను విరివిరిగా తనిఖీ చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో పాఠశాలలో కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ,వైద్య కళాశాలలో మరియు కేజీబీవీ పాఠశాలలలో ఈ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలు ఎక్కడైతే సమూహంగా ఉన్నచోట చట్టం యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత పై ప్రచార సామాగ్రి కళాజాతతో ప్రచారం చేయాలన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన అబార్షన్లు చేసిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం జిల్లాలో ఈ చట్టంపై నిర్వహిస్తున్న కార్యక్రమాలపై తీసుకున్న చర్యలపై వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత రాణి, డాక్టర్ నాజియా, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ నాగరాజు, డీఎస్పీ రవి తదితరులు పాల్గొన్నారు.