విశ్వభారతి హైస్కూల్ ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

Uncategorized జహీరాబాద్ సంగారెడ్డి

విశ్వభారతి హైస్కూల్ ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

విద్యార్ధి, విద్యార్థులతో కృష్ణుని జన్మాష్టమి వేడుకలు 

కోహిర్ మండల్ కేంద్రంలో విశ్వభారతి హైస్కూల్ లో వేడుకలు 

మీ న్యూస్ జహీరాబాద్ ప్రతినిధి ఆశోక్ 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ కేంద్రంలో విశ్వభారతి హైస్కూల్ లో విద్యార్ధి, విద్యార్థులతో కృష్ణుని జన్మాష్టమి వివిధ వేశాధారణతో ఘనంగా జరిగింది.
ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రావణ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి ,గోకులాష్టమ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.వేణు మాధవుడు లోకానికి గురువు. గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికీ దారి చూపాడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా.. తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు. అంతేకాదు గోప బాలకుడిగా, సోదరునిగా, అసురసంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే. అందుకే కన్నయ్యను అందరు బాగా ఇష్టపడతారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు,ప్రజా ప్రతినిధులు, విద్యార్ధి తల్లిదండ్రులు, తదితరులు పలుగోన్నారు