మీ:: న్యూస్ ప్రతినిధి సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ కోల రవీందర్ గౌడ్…సూర్యాపేట జిల్లా కోదాడ ప్రజలకు అందుబాటులో స్పార్క్ కేఫ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడలోని గవర్నమెంట్ హాస్పటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన స్పార్క్ కేఫ్ ను మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని. ప్రమీల, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఉన్నత తమకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి వ్యాపారంలో రాణించి పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. నమ్మకమైన సేవలందించి వినియోగదారుల మన్ననలు పొందాలన్నారు. అనంతరం కేఫ్ నిర్వాహకులు గౌస్, రహీం, కరీం లకు శుభాకాంక్షలు తెలుపుతూ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు,కాంగ్రెస్ పార్టీ నాయకులు బషీర్ భాయ్, స్థానిక కౌన్సిలర్ కోటిరెడ్డి, బాగ్దాద్, భాజాన్, అబ్బు తదితరులు పాల్గొన్నారు…..