మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 15::గిరిజన జాతిని చైతన్యం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అనే బంజారా ట్రస్ట్ అధ్యక్షులు లూనావత్ పాండు నాయక్ అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలోని బంజారా భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అణిచివేయబడుతున్న గిరిజన జాతిని చైతన్యం చేసి ఉన్నతంగా నిలబెట్టేందుకు సేవాలాల్ మహారాజ్ కృషి చేశారన్నారు. గిరిజనులంతా ఐక్యంగా ఉండే సంత్ సేవాలాల్ సూచించిన మార్గంలో పయనిస్తూ ఆయన ఆశయాలను సాధించాలన్నారు. సంతు సేవాలాల్ జయంతి మహోత్సవంలో భాగంగా నేడు బోగ్ బండర్ నిర్వహించామని రేపు మే రామా యాడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు ధరావత్ బాబు నాయక్, బాలాజీ నాయక్, ధరావత్ వెంకన్న,వాంకుడోత్ వెంకన్న, పూల్ సింగ్,హరి నాయక్, గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు మోతిలాల్, బగ్గులాల్ తదితరులు పాల్గొన్నారు.