ఘనంగా గ్రాండ్ టెస్ట్ బహుమతుల ప్రధానోత్సవం

Uncategorized నల్లగొండ లైఫ్ స్టైల్ సూర్యాపేట

ఘనంగా గ్రాండ్ టెస్ట్ బహుమతుల ప్రధానోత్సవం

సమాజ హితము కోరే వారే జర్నలిస్టులు

 

టిపిసిసి డెలిగేట్ లెఫ్ట్ కెనాల్ మాజీ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

 మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమం పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అధ్యక్షతన వహించిన

ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాజీ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ… జర్నలిస్టులు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి తీసేందుకు మంచి కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందనీయమన్నారు. మొట్టమొదటిసారిగా ఎక్కడ నిర్వహించని గ్రాండ్ టెస్ట్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించారని ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. గత కొంతకాలంగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సారధ్యంలో మీ కల త్వరలోనే సహకారం అవుతుందన్నారు. అనంతరం టి యు డబ్ల్యూ జే హెచ్ 143 యూనియన్ జిల్లా అధ్యక్షులు వజ్జే వీరయ్య మాట్లాడుతూ… జర్నలిజం కత్తి మీద సాము లాంటిదని ప్రభుత్వాలు మారుతున్న పాలకులు మారుతున్న జర్నలిస్టుల సమస్యలు మారడం లేదన్నారు. గత ప్రభుత్వంలో కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారమవుతాయని ఆశగా ఎదురు చూసామని కానీ అది సాధ్యం కాలేదని ప్రస్తుత ప్రభుత్వంలోనేన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నామని తెలిపారు. అనంతరం సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజనగౌడ్ మాట్లాడుతూ… ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తప్పనిసరిగా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరిస్తారని ఆ నమ్మకం మాకు ఉందంటూ తెలిపారు…