శ్రీ కోదండ రామచంద్రస్వామి దేవాలయంలో సంప్రోక్షణ మహోత్సవం
మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 10 మోతె మండలం కొత్తగూడెం గ్రామంలో ప్రియా భగవత్ బంధువుల్లారా మన గ్రామంలో వెలిసిన భక్తుల పాలిట కల్పతర్వై సమస్త భక్తజనం అందరికి తన కర్ణ కటాక్ష వీక్షణాలతో అనుగ్రహిస్తూ కొలువైవున్న శ్రీ కోదండ రామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం విశ్వశాంతిని కాంక్షిస్తూ10-2-2025 సోమవారం ఉదయం 11 గంటల 14 నిమిషములకు పునర్వసు నక్షత్ర యుక్త మేష లగ్నం పుష్కరహముర్తన శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ మహోత్సవం జరుగును జరుగును కావున భగవత్ బంధువులందరూ ఇట్టి పూజ కార్యక్రమం లో పాల్గొని స్వామివారి అనుగ్రహమునకు పాత్రులు కాగలరు కార్యక్రమం వివరములు. ఉదయం6-30 నుండి తిరువారాధన నివేదన. మంగళ శాసనం. శాత్తుమురై. తీర్థ గోష్టి ఉదయం8 గంట ల నుండి స్వస్తి వాచనం. శ్రీ విశ్వ సేన ఆరాధన. వాసుదేవ పుణ్య హవాచనం. రక్షాబంధనం మహా కుంభ స్థాపన. అగ్ని ప్రతిష్ట. మహా శాంతి హోమం. ధ్రువమూర్తులకి. ఉత్సవ మూర్తులకు నవ కలశ స్థాపన తీరు మంజనం, అభిషేకం,పూర్ణహుతి. మహా సంప్రోక్షణ. మాధ్యానిక తిరువార నివేదన. మంగళ శాసనం సాతుమురై. తీర్థ గోస్ట్ ప్రసాద వినియోగం.ఆహ్వానించువారు ఆలయ అర్చకులు మరియు ఆలయ ధర్మకర్తలు ఆలయ కమిటీ చైర్మన్. కొత్తగూడెం గ్రామం. భక్త బృందం.