సాని కొంపలకు, అసాంఘిక శక్తులకు (గంజాయి ) అడ్డాగా సమీకృత మార్కెట్

Uncategorized క్రైమ్ నల్లగొండ సూర్యాపేట

సాని కొంపలకు, అసాంఘిక శక్తులకు (గంజాయి ) అడ్డాగా సమీకృత మార్కెట్

ముద్దు ముచ్చట్లకు గాజుల చప్పుళ్ళకు బెడ్ రూమ్ అడ్డాలుగా ముస్తాబైన సమీకృత మార్కెట్

 కోట్లాది రూపాయలు ఖర్చుచేసిన సూర్యాపేట సమీకృతం 

మూత్రశాలలకు మరుగుదొడ్లకు ఉపయోగపడుతున్న కోట్లాది రూపాయల సమీకృత మార్కెట్

సిగరెట్ అడ్డాలకు మందు బాబులకు రాసలీలలకు అనువైన చోటు అనువైన అడ్డాగా కోట్లాది రూపాయల ఖర్చుపెట్టిన సమీకృత మార్కెట్

ఏదైనా ఒక అభివృద్ధి పని చేస్తున్నామంటే అది ఎవరి కోసం చేస్తున్నాం ఎందుకోసం చేస్తున్నాం ఎటువంటి లాభాలు ఉంటాయి అనే విషయాలపై ఆధారపడి ఉంటుంది.. కానీ సూర్యాపేటలో అటువంటి విషయాలపై అవగాహన ఉండదు

పల్లెటి రమేష్ కుమార్ బహుజన్ ముక్తి పార్టీ 

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 14 :::

 సూర్యాపేటలో కోట్లాది రూపాయల ఖర్చు చేసి సమీకృత మార్కెట్ను ఏర్పాటు చేశారు.. చిరు వ్యాపారాల కోసం కూరగాయల వ్యాపారుల కోసం మాంసము వ్యాపారుల కోసం ఏర్పాటు చేసినటువంటి సమీకృత మార్కెట్.. కానీ ఇందులో కొన్ని లోపాల వల్ల అందరి వ్యాపారస్తులు లాబ పడకుండా కొందరు వ్యాపారస్తులు మాత్రమే లాభపడేలా ఈ యొక్క సమీకృత మార్కెట్ కట్టారని , కొన్ని రోజులు ఓపెన్ చేసి తర్వాత మూసి వేసినారు.తర్వాత అధికారులు ఆ యొక్క మార్కెట్ వ్యాపారస్తులతో చర్చలు చేసిన ఫలితం ముందుకు వెళ్లలేదు. కొన్ని ఎంట్రన్స్ లో ఏర్పాటు చేయబట్టి ఆ ఎంట్రన్స్ లో నుంచి లోపటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ చుట్టుపక్కలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు మాత్రమే ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది. ఇంకా లోపటికి వెళ్లే కొద్ది వ్యాపారం అసలు జరగకుండా చాలామంది నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమీకృత మార్కెట్ ని కొన్ని మార్పులు చేర్పులతో చేసుకుంటూ వెళ్తే సూర్యాపేట నడిబొడ్డులో ఈ యొక్క మార్కెట్ అతి పెద్ద మార్కెట్ గా చరిత్ర సృష్టిస్తుంది. ఈ విషయంలో నాకెందుకులే అనుకునే ఈ మార్కెట్ అధికారులు నాకెందుకులే అనుకున్న ఈ మున్సిపల్ అధికారులు ఈ యొక్క ప్రభుత్వ అధికారులు వాళ్ల చెత్త పనితీరుకు ఇది నిదర్శనమని చెప్పవచ్చు.ఆ యొక్క ఎంట్రన్స్ లను చుట్టుపక్కల ఉన్నటువంటి కింద అన్ని గోడలు కూలగొట్టి అన్ని వైపులా ఎంట్రన్స్ ని ఏర్పాటు చేస్తే అన్ని దిక్కుల ఎంట్రెన్స్ ఏర్పాటు చేస్తే ఏ దిక్కు నుంచి అయినా వచ్చిన వాళ్ళు కూడా ఆ దిక్కులో ఆ యొక్క పార్కింగ్ చేసుకొని ఆ యొక్క రూట్లో వెళ్లి అక్కడ వ్యాపారం జరగడానికి ఆస్కారం ఉంటుంది.. ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా సానికొంపలకు అడ్డాగా సిగరేట్లకు రాసలీలకు ముద్దు ముచ్చట్లకు మూత్రంలకు మరుగుదొడ్లకు మాత్రమే ఈ యొక్క కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజల సొమ్మును మురికిపాలు చేసినటువంటి ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకొని వెంటనే అధికారులు సమస్యను వెంటనే పరిష్కరించి నన్ను ముందుకు తీసుకెళ్లాలని బహుజన్ ముక్తి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లెటి రమేష్ కుమార్ డిమాండ్