ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా నిందితులను శిక్షించాలి

Uncategorized క్రైమ్ నల్లగొండ రాజాకియం సూర్యాపేట

ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా నిందితులను శిక్షించాలి

 ఎమ్మెల్యేలు వివేక్‌ వెంకటస్వామి, కేఆర్‌ నాగరాజు

సూర్యాపేట జిల్లా మీ31 న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 1::వడ్లకొండ్ల కృష్ణ అలియాస్‌ మాలబంటిని హత్య చేసిన నిందితులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా వెంటనే శిక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెన్నూరు శాసన సభ్యులు వివేక్‌ వెంకటస్వామి, వర్థన్నపేట శాసన సభ్యులు కేఆర్‌ నాగరాజులు డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో బంటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సమాజంలో ఇంకా కులవివక్షత ఉందని, కులం పేరుతో హత్యలకు పాల్పడడాన్ని ఖండించారు. ప్రణయ్‌ హత్య కేసులు నిందితులు ఏమయ్యారో గుర్తు చేసుకోవాలన్నారు. బంటి కుటుంబ సభ్యులకు రూ.1 కోటి ఎక్స్‌ గ్రేషియా చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.