కార్పొరేట్ శక్తులకు ఊడీగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం….
కాంగ్రెస్ ఎన్నికలముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
మీ:: న్యూస్… మోతే: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తు,పేదలను విస్మరిస్తున్నారనిసిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డివిమర్శించారు.మంగళవారం మోతే మండలం రావి పహాడ్ గ్రామంలోసిపిఎం మండల కమిటీ సభ్యులుకొండా రాములు, బానోతులచ్చిరాం, షేక్ జహీనాభి అధ్యక్షతన జరిగిన సిపిఎం పార్టీ మోతే మండల 8వ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తూ పేదలను విస్మరిస్తున్నారని వారు విమర్శించారు. దేశంలోని మతోన్మాద శక్తులు బిజెపి దాని అనుబంధ సంఘాలు అధికారంలో ఉండటం వల్ల మైనార్టీ మతాలపై రోజురోజుకు తీవ్రమైన దాడులు పెరుగుతున్నాయని అన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన ఆర్థిక విధానాలను అమలు చేస్తూ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని వారు విమర్శించారు. రాష్ట్రంలో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని అన్నారు. అత్యంత నిరుపేదలైన వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల ఇస్తామని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని, విద్యా, ఉద్యోగ నియమకాలను పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని వారు ఆరోపించారు. రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మాటలకే పరిమితమైంది 40 శాతం మంది రైతుల కంటే ఎక్కువ రైతులకు రుణాలు మాఫీ చేయలేదుఅన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలని గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామాల్లో పట్టణాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని వారు డిమాండ్ చేశారు ఈ మహాసభ ప్రారంభ సూచికంగా సిపిఎం పార్టీ పతాకాన్ని సిపిఎం సీనియర్ నాయకురాలు కొండ రాములుఆవిష్కరించారు.ఈ సందర్భంగా మోతే మండలంలోమూడు సంవత్సరాల కాలంలోసిపిఎం పార్టీ నిర్వహించిన ప్రజా పోరాటాలనివేదికనుసిపిఎంమండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి ప్రవేశపెట్టారు.ఈ మహాసభలోసిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుమట్టి పెళ్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దేవరం వెంకటరెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి , సిపిఎం మండల కమిటీ సభ్యులు గుంట గాని ఏసు, కిన్నెరపోతయ్య,కాంపాటి శ్రీను, కక్కిరేణి సత్యనారాయణ, నాగం మల్లయ్య, చర్లపల్లి మల్లయ్య, సోమ గాని మల్లయ్య, కొండ భాస్కర్, బూడిద లింగయ్య, పిడమర్తి అశోక్, జంపాల స్వరాజ్యం, రెడ్డి మల్ల ఇందిరా, ఎర్రబోయిన మాల్సుర్, దోసపాటి శ్రీనివాస్, కోడి లింగయ్య, గడ్డం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.