ఉపాధి హామీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి
మోతే మీ న్యూస్ ప్రతినిధి జనవరి 29::: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేయాలని పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, వివిధ రకాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మోతే మండల కేంద్రం లో ఈజీఎస్ కార్యాలయం ముందు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈసీ శ్రీహరి టెక్నికల్ అసిస్టెంట్ ఉమ్లా నాయక్ సురేష్ సిహెచ్ రామయ్య కంప్యూటర్ ఆపరేటర్లు శ్రీనివాస్ మన్సూర్ ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మయ్య. నగేష్. ఉప్పయ్య. సంధ్య తదితరులు పాల్గొన్నారు