గురుకుల సంక్షేమ హాస్టల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి.
పుల్లూరి సింహాద్రి పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు, బండి రవి పివైఎల్ జిల్లా కోశాధికారి
మీ న్యూస్ సూర్యపేట్ ప్రతినిధి డిసెంబర్ 10:: సంక్షేమ హాస్టల్లో గురుకులాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్ లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోట చలం కు పి.డి.ఎస్.యు – పివైఎల్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి పివైఎల్ జిల్లా కోశాధికారి బండి రవి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో గురుకులాలలో గత కొన్ని రోజులుగా భోజనంలో నాణ్యత లోపం వలన రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ మూలంగా అనేక మంది విద్యార్థులు అనారోగ్య బారిన పడి హాస్పటల్ పాలవుతున్నారని అని కొంతమంది విద్యార్థులు చనిపోతున్నారని అన్నారు. జిల్లా వైద్య అధికారులు వెంటనే స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులలో, సంక్షేమ హాస్టల్లో, ప్రభుత్వ పాఠశాలలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య సేవలు అందించాలని కోరారు. విద్యార్థులకు మెడికల్ కిట్లు అందించాలని కోరారు. విద్యార్థులకు డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారానికి ఒక్కసారైనా డాక్టర్లు ప్రభుత్వ పాఠశాలను, గురుకులాలను మరియు సంక్షేమ హాస్టల్ ను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్, పివైఎల్ డివిజన్ నాయకులు వీరబోయిన లింగయ్య, దూదిపాల ప్రవీణ్, మహేష్, వినయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.