ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా చర్యలు తీసుకోవాలి
కార్యాలయం చుట్టూ రైతుల ప్రదక్షిణలతో ఆర్థిక ఇబ్బందులు
బిఆర్ఎస్ రైతు సమన్వయకర్త రామలింగారెడ్డి
రైతుకు బిఆర్ఎస్ అండ

మీ న్యూస్ ప్రతినిధి గణేష్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అంటూ ఇచ్చిన గడువు లో రైతులందరికీ రుణమాఫీ చేయలేకపోయిందని తాండూర్ మండల బిఆర్ఎస్ రైతు సమన్వయకర్త రామలింగారెడ్డి అన్నారు. బుధవారం తాండూర్ మండలానికి చెందిన రైతులు తమకు రుణమాఫీ కాలేదని తాండూర్ వ్యవసాయ కార్యాలయం దగ్గర పడి కాపులు కాసారు. విషయం తెలుసుకున్న తాండూర్ మండల బిఆర్ఎస్ రైతు సమన్వయకర్త రామలింగారెడ్డి
రైతులకు అండగా నిలబడ్డారు. ఈ సందర్భంగా పలువురు రైతులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అంటూ హామీ ఇచ్చినా గడువులో హామీ నెరవేర్చలేదని అన్నారు కొంతమందికి రైతు రుణమాఫీ చేయడం మిగతా రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించడం సరికాదని అన్నారు. కార్యాలయ చెట్టు ప్రదర్శనలు చేస్తున్న రైతులకు రుణమాఫీ కావడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రైతులందరికీ బిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రేపు జరగబోయే రైతు రుణమాఫీ పై నిరసన కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనాలని అన్నారు ఈ కార్యక్రమంలో తాండూర్ మండల వ్యవసాయ రైతులు తదితరులున్నారు