మాల మహానాడు జాతీయ అధ్యక్షుడి పై హత్యాయత్నం కేసు నమోదు చేయగలరు
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జనవరి 18 :::సూర్యాపేట రూరల్ మండలం అధ్యక్షులు తాటిపాముల నవీన్ మాదిగ మాట్లాడుతూ నిన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ పై.. మాల మహానాడు జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతున్న పసుల రామ్మూర్తి చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఓ ప్రధాన పత్రిక ఆధారంగా నిన్న మాట్లాడిన మాటల రికార్డుగా దానిపై ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది.30 సంవత్సరాలుగా సామాజిక న్యాయం కోసం సమాన పంపిణీ రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ, ఎస్సీ వర్గీకరణకు అన్ని ప్రభుత్వాలు, అన్ని కమిషన్లు, వివిధ రాజకీయ, వామపక్ష పార్టీలు, సమస్త పౌర సమాజం, మేధావి వర్గం, ఎస్సీ ఎస్టీ, బీసీ ,మైనార్టీ అగ్రకులాలు, సైతం వర్గీకరణను సమర్థిస్తూ మద్దతిస్తున్న తీరును గర్వించదగ్గ పోరాట స్ఫూర్తి కి, నిలువెత్తు నిదర్శనం సామాజిక ఉద్యమాలకు రథసారథిగా కొనసాగుతున్న అభినవ అంబేద్కర్ అయిన టువంటి మందకృష్ణ మాదిగ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొట్టి చంపుతామని బెదిరింపులకు పాల్పడుతూ ప్రకటనలు చేసిన రామ్మూర్తి పై తక్షణమే అత్యాయత్నం కేసు నమోదు చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో సమాజంలో దోషిగా నిలబడ్డ మాల స్వార్థపరులైన ఇలాంటి స్వార్థ దుర్మార్గులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. సూర్యాపేట రూలర్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మార్పీఎస్ రూరల్ మండల అధ్యక్షులు తాటి పాముల నవీన్ మాదిగ ఫిర్యాదు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు మాదిగ ఎమ్మార్పీఎస్ అనుబంధాల సంఘాల సమన్వయ కర్త చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ సూర్యాపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎర్ర వీరస్వామి మాదిగ సూర్యాపేట నియోజకవర్గం ఇంచార్జ్ ములకలపల్లి రవి మాదిగ సూర్యాపేట రూలర్ మండల ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి కాటపల్లి సందీప్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరపంగి లింగస్వామి మాదిగ ఎమ్మార్పీఎస్ ప్రచార కార్యదర్శి ములుగురు రాజు మాదిగ సూర్యాపేట పట్టణ అధ్యక్షులు బొజ్జ వెంకన్న మాదిగ ఆత్మకూర్ ఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ చివేంల మండల అధ్యక్షులు కొంగుల సతీష్ మాదిగ ఎంఎస్పీ మండల అధ్యక్షులు చెరుకుపల్లి కిరణ్ మాదిగ ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షులు సిరిపంగి నవీన్ మాదిగ సూర్యాపేట రూరల్ పంతం లింగయ్య దైద శీను మాదిగ మొరిగిరి ర సునీల్ బుచ్చిబాబు గోపీచంద్ మైఖేల్ మనోజ్ పాల్గొన్నవారు..