రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి
రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
మోతే మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు
జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 18
లగచర్ల రైతన్నలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి మోతే మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు అన్నారు. మంగళవారం
*బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట తారక రామారావు గారి పిలుపుమేరకు కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారి* ఆదేశానుసారం మోతే మండల కేంద్రంలోని డా” బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం అందించిన బిఆర్ఎస్ మండల నాయకులు. అనంతరం వారు మాట్లాడుతూ…భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తుందని, అన్నింటికంటే ముఖ్యంగా దళిత గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల చాలా తీవ్రంగా అణిచివేతకు గురవుతున్నారు, పేద దళిత గిరిజనుల రైతులు తరతరాలుగా సాగు చేసుకుంట భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారు అని, స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం , కొడంగల్ లోని లగచర్లలో పేద రైతన్నల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. ఓసారి ఫార్మా విలేజ్ అని ,మరోసారి ఇండస్ట్రీయల్ కారిడారని మాయ మాటలు చెబుతూ ఏదోలాగా రైతన్నల భూముల లాక్కొని అదానికి, మరియు రేవంత్ రెడ్డి గారి అల్లుడికి అప్పజెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గుండాల గంగులు, మండల నాయకులు జిల్లెపల్లి ముత్తయ్య, వెంకట రెడ్డి, సుధాకర్, నరేష్, మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు నరేష్, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేశం, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.