స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని 

Uncategorized తాండూర్ తెలంగాణ రంగారెడ్డి రాజాకియం వికారాబాద్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని 

బీసీ డెడికేటెడ్ కమిషన్ కలిసిన బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్

మీ న్యూస్ ప్రతినిధి :::స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భుసాని వెంకటేశ్వరరావును కలిసి వినతపత్రం సమర్పించినట్లు బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతు బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయమే జరుగుతుందని 55 శాతం పైగా ఉన్న బీసీలకు 18% రిజర్వేషన్లు కల్పిస్తున్నారని విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీల జనాభా తగ్గట్టు రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డెకరేషన్ లో చెప్పినట్టుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని కోరడం జరిగింది గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే చేసిన లెక్కలు బయట పెట్టకపోగా 27% ఉన్నటువంటి స్థానిక సంస్థల లో బీసీ రిజర్వేషన్లను 18 శాతం కుదించి ఎన్నికల నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కూడా సాకులు చెప్పకుండా 42 శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని కోరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ముదిరాజ్ రావులకోలు నరేష్ ప్రజాపతి నరసింహ నాయక్ చందు తదితరులు పాల్గొన్నారు