వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలి.
వ్యవసాయ కార్మికులకు సమగ్ర కేంద్ర శాసన చట్టం చేయాలి.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు

మీ న్యూస్ సూర్యపేట జిల్లా స్టాప్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::: మేతే : వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసిందని ఆ వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మలకలపల్లి రాములుడిమాండ్ చేశారు.బుధవారం మోతే మండల పరిధిలోని రాఘవాపురం ఎక్స్ రోడ్ లో ని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కుటుంబాలను ఆదుకోవడం కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్న నేటికీ ఎన్నికల వాగ్దానం అమలుకు నోచుకోలేదని ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇల్లు లేని వ్యవసాయ కార్మిక పేదలందరికీ ఇంటి స్థలము ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములలో ఇంటి స్థలములేని లక్షలాది మంది పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తుంటే గుడిసెలు తొలగించి వారిపైన తప్పుడు కేసులు పెట్టి జైల్లో వెస్తున్నారని ఆ విధానాన్ని వెంటనే విడనాడి అర్హత కలిగిన పేదలందరికీ పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని అలాగే పేదలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని అన్నారు. 2012 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచడం కోసం కనీస వేతన జీవోను తీసుకురావడం జరిగిందని రెండు సంవత్సరాలకు ఒకసారి వేతన జీవోను సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీల వేతనాలు పెంచడం కోసం వచ్చిన జీవోను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలమంతా సవరించలేదనిఆరోపించారు. వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్ కు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారనివిమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వేతన జీవోను సవరించి రోజు కూలి 600 రూపాయలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు నమ్మి వ్యవసాయ పేదలంతా కాంగ్రెస్ కు ఓటు వేశారని కానీ నేటికీ ఆ జీవోను సవరించలేదు కొత్త జీవోను తీసుకురాలేదు వెంటనే కొత్త వేతన జీవోను తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఆర్థికంగా అభివృద్ధి కావడానికి వేతనాలు పెంచాలని రెవెన్యూ అధికారుల ద్వారా గ్రామసభలు నిర్వహించి కూలీలకు న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ కార్మిక రంగానికి సంబంధించిన నిధుల్ని పెంచడంలో ఉపాధి హామీ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు 15 శాతం కేటాయించాల్సి ఉండగా , నూటికి డెబ్బై శాతం ఉన్న ఆ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం పెత్తందారులకు కాంట్రాక్టర్లకు బడ్జెట్ లో పెద్దపీట వేసి దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న వ్యవసాయ కార్మిక రంగాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఉపాధి హామీ చట్టానికి రెండున్నర లక్షల కోట్లు కేటాయించాల్సి ఉండగా నామమాత్రం కేటాయింపులతో చేతులు దులుపుకున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్త ఉద్యమాలకు వ్యవసాయ కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించటానికి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్యకర్తలకు, మరింత అవగాహన పెంచడం కోసం ఈనెల 26,27,28 తేదీలలో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో ఉన్న 22 కోట్ల వ్యవసాయ కార్మికులకు కేంద్ర సమగ్ర శాసన చట్టం చేయాలని కోరారు. ఈ శిక్షణ తరగతులకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఈ శిక్షణ తరగతులలో రైతు సంఘం మోతే మండల అధ్యక్షులు ములుకూరి గోపాల్ రెడ్డి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సోమపంగా జానయ్య, కడెం కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం మోతే మండల కార్యదర్శి కిన్నర పోతయ్య, మహిళ కూలీల నాయకురాలుజంపాల స్వరాజ్యం, గుండు సైదయ్య, పులసరి వెంకట ముత్యం, కొల్లూరు బాబు, వనం సోమన్న, ఆరే రామకృష్ణారెడ్డి, బూడిద లింగయ్య, సోమ గాని మల్లయ్య, చర్లపల్లి మల్లయ్య, గోగులోతు కృష్ణ, ఎర్రబోయిన మల్సూరు, దోస పాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలి.
వ్యవసాయ కార్మికులకు సమగ్ర కేంద్ర శాసన చట్టం చేయాలి.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు
మోతే: వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసిందని ఆ వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మలకలపల్లి రాములుడిమాండ్ చేశారు.బుధవారం మోతే మండల పరిధిలోని రాఘవాపురం ఎక్స్ రోడ్ లో ని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కుటుంబాలను ఆదుకోవడం కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్న నేటికీ ఎన్నికల వాగ్దానం అమలుకు నోచుకోలేదని ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇల్లు లేని వ్యవసాయ కార్మిక పేదలందరికీ ఇంటి స్థలము ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములలో ఇంటి స్థలములేని లక్షలాది మంది పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తుంటే గుడిసెలు తొలగించి వారిపైన తప్పుడు కేసులు పెట్టి జైల్లో వెస్తున్నారని ఆ విధానాన్ని వెంటనే విడనాడి అర్హత కలిగిన పేదలందరికీ పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని అలాగే పేదలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని అన్నారు. 2012 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచడం కోసం కనీస వేతన జీవోను తీసుకురావడం జరిగిందని రెండు సంవత్సరాలకు ఒకసారి వేతన జీవోను సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీల వేతనాలు పెంచడం కోసం వచ్చిన జీవోను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలమంతా సవరించలేదనిఆరోపించారు. వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్ కు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారనివిమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వేతన జీవోను సవరించి రోజు కూలి 600 రూపాయలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు నమ్మి వ్యవసాయ పేదలంతా కాంగ్రెస్ కు ఓటు వేశారని కానీ నేటికీ ఆ జీవోను సవరించలేదు కొత్త జీవోను తీసుకురాలేదు వెంటనే కొత్త వేతన జీవోను తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఆర్థికంగా అభివృద్ధి కావడానికి వేతనాలు పెంచాలని రెవెన్యూ అధికారుల ద్వారా గ్రామసభలు నిర్వహించి కూలీలకు న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ కార్మిక రంగానికి సంబంధించిన నిధుల్ని పెంచడంలో ఉపాధి హామీ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు 15 శాతం కేటాయించాల్సి ఉండగా , నూటికి డెబ్బై శాతం ఉన్న ఆ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం పెత్తందారులకు కాంట్రాక్టర్లకు బడ్జెట్ లో పెద్దపీట వేసి దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న వ్యవసాయ కార్మిక రంగాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఉపాధి హామీ చట్టానికి రెండున్నర లక్షల కోట్లు కేటాయించాల్సి ఉండగా నామమాత్రం కేటాయింపులతో చేతులు దులుపుకున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్త ఉద్యమాలకు వ్యవసాయ కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించటానికి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్యకర్తలకు, మరింత అవగాహన పెంచడం కోసం ఈనెల 26,27,28 తేదీలలో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో ఉన్న 22 కోట్ల వ్యవసాయ కార్మికులకు కేంద్ర సమగ్ర శాసన చట్టం చేయాలని కోరారు. ఈ శిక్షణ తరగతులకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఈ శిక్షణ తరగతులలో రైతు సంఘం మోతే మండల అధ్యక్షులు ములుకూరి గోపాల్ రెడ్డి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సోమపంగా జానయ్య, కడెం కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం మోతే మండల కార్యదర్శి కిన్నర పోతయ్య, మహిళ కూలీల నాయకురాలుజంపాల స్వరాజ్యం, గుండు సైదయ్య, పులసరి వెంకట ముత్యం, కొల్లూరు బాబు, వనం సోమన్న, ఆరే రామకృష్ణారెడ్డి, బూడిద లింగయ్య, సోమ గాని మల్లయ్య, చర్లపల్లి మల్లయ్య, గోగులోతు కృష్ణ, ఎర్రబోయిన మల్సూరు, దోస పాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.