36L పరివాహక మోతె మండల రైతుల సమావేశం 

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం వ్యవసాయం సూర్యాపేట

36L పరివాహక మోతె మండల రైతుల సమావేశం 

 

 

మీ న్యూస్ మోతే మండల ప్రతినిధి జనవరి 15::16/01/2025 నాడు 36ఎల్ కాలవ నీళ్లు విడుదల చేయనున్నారు. అట్టి వచ్చే కాలువ నీళ్లను మోతె మండలానికి చివరి ఆయకట్టుకి అందే విధంగా అధికారులు చూడాలని కోరారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం 36 ఎల్ కాలువ ద్వారా మోతె, నడిగూడెం, మునగాల మండల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని. 72 డిబి చివ్వెంల పెన్ పహాడు మండలాలకు వెళ్లే కాలువ లోతు ఉన్నందున అటువైపుగా ప్లాటింగ్ ఎక్కువగా ఉన్నది ఏనుబాంల దగ్గర 72 డిబి నుండి మోతె ,మునగాల, నడిగూడెం మండలాలకు 36 Lకు వచ్చే నీటి ప్రవాహం తక్కువగా ఉన్నది ఎందుకనగా పూడిక ఉండడం,లోతు తక్కువ ఉండటం,మరియు వెడల్పు తక్కువగా ఉండటం వలన నీటి ప్రవాహం తక్కువగా ఉన్నది అని రైతులు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు స్పందించి పైన పేర్కొన్న మండలాలకు నీరు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని 36 ఎల్, ఎస్సారెస్పీ కాలువ పరివాహక రైతులు తీర్మానం చేశారు. సమావేశంలో మూసి బ్యాక్ వాటర్ వృధాగా పోతున్నందున మూసి బ్యాక్ వాటర్ సుమారుగా మూడు కిలోమీటర్ల మేర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా అడివివేముల తిమ్మాపురం వద్దగల ఎస్సారెస్పీ కాలువకు లిఫ్ట్ ఇరిగేషన్ ఒక ప్రాజెక్టు నిర్మిస్తే,మోతె, నడిగూడెం, మునగాల మిగిలిన మండలాలకు ఎస్సారెస్పీ కాలువల ద్వారా వచ్చే వాటర్ ద్వారా పైన మండలాలు శస్యశ్యామలం అవుతాయని రైతులు స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లాలని రైతులందరూ సమావేశమై 36 ఎల్ కాలువ పరివాహ రైతులు తీర్మానం చేశారు. 16/01/2025 నాడు 36 ఎల్ కాలువ నీళ్లు విడుదల చేస్తున్నారు కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 36 ఎల్, ఎస్సారెస్పీ కాలువ పరివాహక రైతులు, ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, కొప్పరాజు సతీష్ బాబు, నందిగామ కృష్ణారెడ్డి, శ్రీనివాస్, లింగయ్య, మోతె మండల వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.