మీ న్యూస్ ప్రతినిధి సూర్యాపేట జిల్లా జనవరి 12:::సూర్యాపేట : జిల్లా కేంద్రం సమీపంలోని దురాజ్ పల్లి వివేకానంద విజ్ఞాన నిలయం గురుకుల ఉన్నత పాఠశాలలో 1996-2002 విద్యా సంవత్సరాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని తిరుమల గ్రాండ్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. రెండు దశాబ్దాల తర్వాత ఒకచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్నేహితులంతా తాము జీవితంలో స్థిరపడ్డ తీరు తెలుసుకొని ఒకరినొకరు అభినందించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆడుతూ పాడుతూ రోజు మొత్తం సరదాగా గడిపారు.నాడు విద్యాబుద్దులు చెప్పి నేడు జీవితంలో తాము ఉన్నతంగా ఏదిగేలా తీర్చిదిద్దిన నాటి ఉపాధ్యాయులు హెచ్ఎం గోపాలకృష్ణ, టీచర్లు శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణరెడ్డి, మల్లారెడ్డి, మొండికత్తి,శ్రీనివాస్,పిన్నం రవి, అబ్దుల్లా, మనోహర్, మాధవి లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సునీల్, సుధాకర్, సైదులు, పవన్, శ్రీకాంత్, రాధిక, ఫరీదా, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.