ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం 

Uncategorized జహీరాబాద్ రాజాకియం సంగారెడ్డి

ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం 

 

 

 

మీ న్యూస్ ప్రతినిధి ::: ధర్మ సమాజ్ పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 75 వ భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించడం జరిగింది… అనంతరం భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మ్యాతరి మహేందర్ మహారాజ్ మాట్లాడుతూ 2000 సంవత్సరాల అంధకారం తర్వాత, ఈ దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల 11 నెలలు నిర్విరామంగా కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రచించి ఆ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ లో 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదింప జేసిన సందర్భం, భారత ప్రజల జీవితాల్లో చెరగని ముద్రను వేసిందని భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజల మౌలిక జీవితాల్లో మార్పు కలిగి ప్రజలు మానవ మర్యాదల్ని, గౌరవాన్ని పొందుతూ జీవిస్తున్న ఈ సందర్భంలో భారత రాజ్యాంగం వల్ల లబ్ధి పొందిన ఈ దేశ ప్రజలందరూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి భారత రాజ్యాంగ రక్షణ ఆర్మీగా పనిచేయాలని రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే ప్రజాస్వామ్యానికి మనుగడ, ప్రజల జీవితానికి వికాసం కలుగుతుందని అన్నారు