మీ న్యూస్ ప్రతినిధి జనవరి 03::::సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపుమేరకు ఏ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో కోదాడ ఇంచార్జ్ షేక్ నయమ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి బి ఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.. అనంతరం పలువురు మాట్లాడుతూ సంఘ సేవకు పునాదులు వేసింది.సామాజిక విప్లవానికి బాటలు వేసింది..రైతు కుటుంబంలో జన్మించింది.. చదువులమ్మగా అడుగులు వేసింది.జ్యోతిరావు పూలేతో ఎడడుగులు నడిచింది.అణిచివేతకు గురైన మహిళల కోసం బడులను స్థాపించింది.అక్షర పూలమాలతో స్వాగతం పలికింది..అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుంది.అవమానాలు తట్టుకొని గెలుపు తీరాలు చేరింది.విద్యా విప్లవానికి నాంది పలికింది.మహిళ శక్తిని మేల్కొపి పోరాటం చేసింది.మహిళా హక్కులే మానవ హక్కులని నినదించింది.కుల వ్యవస్థ నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించింది.బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపింది.పేదింటి ఆడ బిడ్డలకు తన జీవితం దారపోసింది.. సావిత్రి భాయ్ పూలే నాని కొనియాడారు..వార్డు ఇన్చార్జిలు వార్డు కౌన్సిలర్లు వివిధ హోదా లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.