మాజీ సర్పంచ్ ప్రభుత్వ భూమి ఆక్రమణ పై కలెక్టర్ కి ఫిర్యాదు
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 23 :::::పెన్ పహాడ్ మండల పరిధిలోని ధూపహాడ్ గ్రామ రెవెన్యూ పరిధిలో న్యూ బంజర హిల్స్ తండా కు చెందిన ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ 76 సర్వే నెంబర్147 సర్వే నెంబర్లలో మాజీ సర్పంచ్ తురక భద్రయ్య తండ్రి వీరయ్య, తూరక జానమ్మ భర్త భద్రయ్య, ఇరువురి పేర్లపై 8 ఎకరాల 15 కుంటలు భూమి అక్రమంగా పట్టా చేసుకున్నాడని సోమవారం సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గిరిజన రైతులు ఫిర్యాదు చేసినారు ఈ సందర్భంగా న్యూ బంజర హిల్స్ తండా మాజీ సర్పంచ్ ధారావత్ బిక్షం నాయక్ మాట్లాడుతూ న్యూ బంజర హిల్స్ తండాకు చెందిన గిరిజన రైతులు తాత తండ్రుల నుంచి ఇట్టి భూమిలో పశువులను మేపుతూ జీవనం గడుపుతున్నారని అన్నారు 2018 – 19 గత ప్రభుత్వం భూముల రికార్డుల సవరణ సమయంలో తన పలుకుబడిని ఉపయోగించి మాజీ సర్పంచ్ తురక భద్రయ్య ప్రభుత్వ భూమిని పట్టా చేసుకోవడం జరిగిందని గతంలో ఇట్టి ప్రభుత్వ భూమిని న్యూ బంజర హిల్స్ తండా గ్రామపంచాయతీ నుండి వార్డు నెంబర్లు సర్పంచు గోదాముల నిర్మాణం కొరకు తీర్మానం చేసి సివిల్ సప్లై అధికారులకు పంపడం జరిగిందని ఆయన అన్నారు భూమి అక్రమంగా పట్టా చేసుకున్న వారి పేర్లను తొలగించాలని ఆయన కోరినారు అక్రమంగా భూమి పట్టా చేసుకున్న వారిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వా అధికారుల కోరినాo అన్నారు ఈ కార్యక్రమంలో దారావత్ బిక్షం, ధారావత్ వెంకన్న, లూనావత్ వెంకన్న, ధారావత్ అంజి, లావూరి వెంకన్న, ఇస్లావత్ వెంకన్న, ధారావతు హుస్సేన్, ధారావతు సక్కు, పలువురు గిరిజన రైతులు పాల్గొన్నారు..