మేడ్చల్ మెట్రో రైల్ కోసం మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసిన ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 21::: త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారినుండి మేడ్చల్ మెట్రో రైల్ ను ఫేస్ 2 చేర్చటానికి సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి – ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్
ఎన్నో ఏళ్లుగా మేడ్చల్ ప్రాంత ప్రజలు పోరాడుతున్న మరియు ఎదురుచూస్తున్న మేడ్చల్ మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం కొంపల్లి ఐటీ ఎంట్రిప్రీన్యూర్స్ అసోసియేషన్ (కైటీయా)వ్యవస్థాపక అధ్యక్షులు, మేడ్చల్ మెట్రో రైల్ సాధన సమితి కోర్ కమిటీ సభ్యులు మరియు లాస్య ఇన్ఫోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్, మేడ్చల్ జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పాతూరి సుధాకర్ రెడ్డి, కైటియా మెంబెర్ లాలం నాగరాజు, గౌళికర్ మహేష్ మరియు ఇతరులు హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి గారిని కలిసి మరోసారి వినతి పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా, ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గారి నుండి చాలా స్పష్టమైన హామి వచ్చిందని మరియు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారినుండి సానుకూల ప్రకటన వెలువడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారని చెప్పారు.
మేడ్చల్ మెట్రో రైల్ కోసం ఆన్ లైన్ పిటిషన్ లో 25 వేల ప్రజలు సంతకం చేశారని ఆ సంతకాల లిస్ట్ ను ఎన్వీఎస్ రెడ్డి గారికి అందచేసి, మేడ్చల్ మెట్రోరైల్ కోసం లక్ష సంతకాల సేకరణ ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తామన్నారు. మేడ్చల్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఫేస్ 2 లో చేర్చాలని అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులను, మంత్రులను, అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించి విజ్ఞప్తి చేశారు.
అన్ని ప్రభుత్వాలు నార్త్ హైదరాబాద్ అభివృద్ధిని ను విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తూ, 7 సంవత్సరాల కొంపల్లి ఐటీ ఎంట్రిప్రీన్యూర్స్ అసోసియేషన్ (కైటీయా) గొప్ప కృషితో గత తెలంగాణ ప్రభుత్వం కండ్లకోయ గేట్వే ఐటీ పార్క్ ఏర్పాటు కోసం భూమి పూజ చేసిందని తెలిపారు. ఆతర్వాత ఐటీ ప్రాజెక్ట్ పనులు నత్తనడకగా సాగుతున్నాయని, ఎన్నో ఆశలను పెట్టుకున్న నిరుద్యోగులు ఇప్పుడు నిరాశచెందుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికే ముఖద్వారంగా ఉన్న ఉత్తర హైదరాబాదు నగరాన్ని సమంగా అభివృద్ధి చేయాలని మరియు ఇక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజల ముఖ్య సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ డిమాండ్ చేశారు.